ప్రభాస్ రికార్డుకి అడుగు దూరంలో బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీకి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Update: 2024-12-14 08:31 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీకి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. రెండో వారం కూడా థియేటర్స్ లో అదే ఆదరణ ఈ చిత్రానికి వస్తూ ఉండటం విశేషం. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే ‘పుష్ప 2’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కచ్చితంగా ఇదే జోరు కొనసాగితే లాంగ్ రన్ లో ఈ మూవీ 1500 కోట్లకి పైగా వసూళ్లని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది మొన్నటి వరకు ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ‘కల్కి 2898ఏడీ’ నిలిచింది. ఈ మూవీ 1150 కోట్ల వరకు కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకున్నాయి. ఇప్పుడు ఈ ‘కల్కి’ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి ‘పుష్ప 2’ అడుగు దూరంలో ఉంది. ఈ మూవీ ఇప్పటి వరకు 1067 కోట్లకి పైగా వసూళ్లు చేసింది. శని, ఆదివారాలు కలెక్షన్స్ మరల పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ‘కల్కి’ ప్లేస్ లోకి ‘పుష్ప 2’ రావడం ఖాయం అని అనుకుంటున్నారు. అయితే ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ ని రూల్ చేసి అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో టాప్ 2 టాలీవుడ్ నుంచి వచ్చినవే కావడం విశేషం. వీటి తర్వాత మూడో స్థానంలో హిందీ మూవీ ‘స్త్రీ 2’ ఉంటుంది. ఈ సినిమా 900 కోట్ల వరకు లాంగ్ రన్ లో వసూళ్లు చేసింది.

ఇక ‘పుష్ప 2’ మూవీ హిందీలో కూడా 700+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అక్కడ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. లాంగ్ రన్ లో ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరో వైపు ‘పుష్ప 2’ని జపాన్, చైనా భాషలలో కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ‘పుష్ప 2’ మేకర్స్ ఇప్పుడు ఆ హడావిడిలో ఉన్నారు. అల్లు అర్జున్, సినిమా చుట్టూ నెలకొన్న వివాదం సద్దుమణిగిన తర్వాత మరల సినిమాని ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి తీసుకొని వెళ్లడంపై దృష్టి పెట్టొచ్చని అనుకుంటున్నారు.

Tags:    

Similar News