బదులు తీర్చుకుంటున్న తారక్, బన్నీ ఫ్యాన్స్!

ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఆన్ లైన్ ఫ్యాన్ వార్స్ ఎంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయో తెలిసిందే.

Update: 2025-01-13 11:45 GMT

ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఆన్ లైన్ ఫ్యాన్ వార్స్ ఎంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయో తెలిసిందే. అభిమానులు అంటే ఒకప్పుడు తమ హీరోను ఆరాధించడం, ఆ హీరో సినిమాలను భుజాలపై మోయడం.. వాటిని హిట్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేయడం.. ఇలాగే ఉండేది. కానీ ఇప్పుడు అవతలి హీరోలను సోషల్ మీడియాలో దూషించడం, కించపరచడం. వాళ్ల సినిమాల మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేసి ఫ్లాప్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేయడం.. ఇలా ఉంది వరస. ఈ రెండో పద్ధతికే అందరూ ప్రయారిటీ ఇస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజు రోజుకూ ఈ ట్రెండ్ తీవ్ర రూపం దాల్చుతోంది. సంక్రాంతి సినిమాల్లో ఒకటైన ‘గేమ్ చేంజర్’ మీద తీవ్ర స్థాయిలో జరుగుతున్న విష ప్రచారం ఈ ట్రెండు ఎంత ప్రమాదకరమో తెలియజేస్తోంది.

‘గేమ్ చేంజర్’ యుఎస్ షోలు పూర్తయ్యాయో లేదో ‘డిజాస్టర్ గేమ్ చేంజర్’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది. టాక్ కొంచెం మిక్స్డ్‌గా ఉన్నప్పటికీ మరీ డిజాస్టర్ అనదగ్గ సినిమా కాదిది. కానీ వరుసగా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేశారు. తొలి రోజు కలెక్షన్ల పోస్టర్ బయటికి రాగానే అవి ఫేక్ కలెక్షన్లు అంటూ ‘గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్’ అంటే హ్యాట్ ట్యాగ్‌ను వైరల్ చేశారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. ఇది ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పనే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే రామ్ చరణ్ వెనుక ఉండే మెగా ఫ్యాన్స్ మీద వాళ్లు అంత గుర్రుగా ఉన్నారు. గత ఏడాది దేవర రిలీజైనపుడు, పుష్ప-2 వచ్చినపుడు దాని మీద మెగా ఫ్యాన్స్ విపరీతమైన నెగెటివ్ ప్రచారం వారి ఆరోపణ. ఈ రెండు సినిమాలు రిలీజైనపుడు ఒక వర్గం సోషల్ మీడియాలో డ్యూటీ ఎక్కి ఆ సినిమాల మీద ప్రతికూల ప్రచారం చేసిన మాట వాస్తవం. మెగా ఫ్యాన్స్ అంటే నందమూరి హీరోలను శత్రువులుగా చూస్తారు. కొన్ని కారణాల వల్ల వారిలో బన్నీ పట్ల కూడా వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలోనే వాళ్లు దేవర, పుష్ప-2 సినిమాల నెగెటివిటీ చూపించారు. అందుకు ఇప్పుడు తారక్, బన్నీ ఫ్యాన్స్ బదులు తీర్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

Tags:    

Similar News