దేవరకి కోసం బన్నీ ఫ్యాన్స్… ఇది కదా కావాల్సింది

అందరి హీరోల అభిమానుల్లో ఇలాంటి విష సంస్కృతిని ప్రోత్సహించే వారు ఉన్నారు.

Update: 2024-09-27 04:32 GMT

గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎక్కువైపోయాయి. అభిమానులు గ్రూప్స్ గా విడిపోయి ట్వీట్ లతో మాటల యుద్ధం చేసుకుంటున్నారు. పెద్ద సినిమా వస్తే ఒక వర్గం వారు ఏదో ఒక విధంగా దానిపై నెగిటివిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీమ్స్ తో విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ సినిమాపై బ్యాడ్ ఇంప్రెషన్ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అందరి హీరోల అభిమానుల్లో ఇలాంటి విష సంస్కృతిని ప్రోత్సహించే వారు ఉన్నారు.

ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్ లో తమ ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇండియన్ బాక్సాఫీస్ ని రూల్ చేసే రేంజ్ కి వెళ్లారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు ఈ ఫ్యాన్ వార్స్ కి ముగింపు పలికి మన పాన్ ఇండియా సినిమాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే అనవసరమైన ద్వేషం, తమ హీరో మాత్రమే టాప్ లో ఉండాలనే స్వార్ధంతో కొంతమంది పనిగట్టుకొని ఇతర స్టార్స్ పై దుష్ప్రచారాలు చేస్తున్నారు.

ఈ ప్రభావం సినిమాలపై ఎంతో కొంత పడుతుందని చెప్పొచ్చు. స్టార్ హీరోలు అందరూ కూడా యాంటీ ఫ్యాన్స్ నుంచి నెగిటివిటీ, ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. స్టార్స్ అందరూ మేమంతా ఒకటే అని చెబుతున్నా ఫ్యాన్స్ లో మాత్రం మార్పు రావడం లేదు. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ తాజాగా థియేటర్స్ లోకి వచ్చింది. అర్ధరాత్రి 1 గంటకి బెన్ ఫిట్ షోలు పడ్డాయి. థియేటర్స్ దగ్గర అభిమానులు ఫ్లెక్సీ లు పెట్టి తన హీరోకి విషెస్ చెబుతున్నారు.

ఇక హైదరాబాద్ లో సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ అభిమానులు ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకి విషెస్ చెబుతూ బ్యానర్ కట్టారు. ఇలాంటివి మరికొన్ని చోట్ల కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, బన్నీ మధ్యలో మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి విషెస్ చెప్పినట్లు కనిపిస్తోంది. అయితే ఇలాంటి పాజిటివ్ ప్రమోషన్స్ అందరి హీరోల అభిమానుల మధ్యలో ఉంటే బాగుంటుందనే మాట వినిపిస్తోంది.

బన్నీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి విషెస్ చెబుతూ బ్యానర్1 పెట్టడం ఓ విధంగా మంచి పరిణామం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇది వైరల్ అయితే ఎన్టీఆర్ అభిమానులు నెక్స్ట్ రాబోయే ‘పుష్ప 2’కి ఇలాగే బన్నీకి విషెస్ చెబుతూ బ్యానర్ కడతారు. ఇదే పాజిటివిటీ అందరి హీరోల పైన ఉండాలని మేకర్స్ కోరుకుంటున్నారు. మరి అది సాధ్యం అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News