తండేల్ దేశభక్తి సినిమా కాదు: చందూ మొండేటి
తండేల్ సినిమా గురించి చందూ మొండేటి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అసలు తండేల్ సినిమా కథ ఊహించని విధంగా తన మైండ్ లోకి వచ్చిందని తెలిపాడు.
కార్తికేయ2 సినిమా తర్వాత చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా సినిమా తండేల్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఇప్పటికే చైతన్య, చందూ కలిసి ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు చేయగా, అమరన్ సినిమా తర్వాత సాయి పల్లవి నుంచి వస్తున్న సినిమా ఇదే.
గతంలో సాయి పల్లవి, నాగ చైతన్య కలయికలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. తండేల్ సినిమా గురించి చందూ మొండేటి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అసలు తండేల్ సినిమా కథ ఊహించని విధంగా తన మైండ్ లోకి వచ్చిందని తెలిపాడు.
సవ్యసాచి సినిమా తర్వాతే బన్నీ వాసు తనని కలిశాడని, కానీ వేరే కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా ఆలస్యమైందన్నాడు. డిస్కషన్స్ లో భాగంగా చాలా ఐడియాల గురించి మాట్లాడామని, అందులో తండేల్ కూడా ఉందని, అప్పుడే తండేల్ స్టోరీ లైన్ లో ఓ స్పార్క్ కనిపించిందని, కానీ అల్లు అరవింద్ గారు ముందు అది విని డాక్యుమెంటరీ ఫీల్ ఇస్తుందన్నారని తెలిపాడు చందూ.
అయితే ఆ ఐడియాను ముందుకు తీసుకెళ్లడంలో తన భార్య, సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని తనకు చాలా హెల్ప్ చేశారని చెప్పిన చందూ, ఈ సినిమా మొత్తం పాకిస్తాన్ లో ఉండదని, కేవలం 20 నిమిషాల సీన్స్ మాత్రమే పాకిస్తాన్ కు సంబంధించిన పోర్షన్స్ ఉంటాయని, తాను ఫోకస్ చేసింది దేశభక్తి, పాకిస్తాన్ ఎపిసోడ్స్ కాదని సినిమా మొత్తం మీద యాక్షన్ సీక్వెన్స్ లు రెండే ఉంటాయని వెల్లడించాడు డైరెక్టర్.
తండేల్ దేశ భక్తి సినిమా కాదని, ఇదొక లవ్ స్టోరీ అని, ఇంత గొప్ప లవ్ స్టోరీ రాస్తానని తానెప్పుడూ అనుకోలేదని, నాగ చైతన్యకు ఈ కథ చెప్పగానే ఈ కథ తనకు బాగా నచ్చిందని చెప్పి, నువ్వేం చేయాలనకుంటున్నావో చెయ్యమని చెప్పాడని, అలా తండేల్ సినిమా మొదలైందని, ఈ సినిమా కోసం చైతన్య తన ప్రాణం పెట్టాడని చెప్పిన చందూ, సాయి పల్లవి ఎంతో డెడికేషన్ తో తండేల్ ను పూర్తి చేసిందన్నాడు.
అయితే ఈ సినిమా కంటే ముందు చందూ మొండేటి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కోలీవుడ్ హీరో సూర్యతో సినిమా చేస్తాడని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. సూర్య గారికి కార్తికేయ2 లాంటి సినిమా కావాలన్నారని, ఆయనకు నచ్చే కథ ఆల్రెడీ చెప్పానని చెప్పాడు చందూ. ముందు తండేల్ సినిమా చేయాలని సూర్యకి చెప్పడంతో ఆయన కూడా ఓకే అన్నారని వెల్లడించాడు. తండేల్ తర్వాత చేయడానికి తన దగ్గర మూడు కథలు రెడీగా ఉన్నాయని ఆయన తెలిపాడు.