పుష్ప రాజ్ - శ్రీవల్లి.. హై గ్లామర్ స్ట్రోక్!
పుష్ప రాజ్ శ్రీవల్లి కాంబినేషన్ కనులవిందుగా ఉంటుందని మరోసారి రుజువుచేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ముంబైలో అడుగు పెట్టారు. పుష్ప 2: ది రూల్ కోసం జరుగుతున్న భారీ ప్రమోషన్లలో భాగంగా ఈరోజు జెడబ్ల్యూ మారియట్ సహార్ హోటల్లో నిర్వహించనున్న ప్రత్యేక ప్రెస్ మీట్ కోసం వారు చేరుకున్నారు. ఈ ఈవెంట్లో వారి గ్రాండ్ ఎంట్రీ సోషల్ మీడియాను హీట్ పెంచుతోంది. పుష్ప రాజ్ శ్రీవల్లి కాంబినేషన్ కనులవిందుగా ఉంటుందని మరోసారి రుజువుచేశారు.
అల్లు అర్జున్ వైట్ క్యాజువల్ అవుట్‌ఫిట్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపించగా, రష్మిక మందన్న పసుపు రంగు డ్రెస్సులో తన సింప్లిసిటీతో అందర్నీ ఆకర్షించింది. వీరిద్దరి గ్లామరస్ ప్రెజెన్స్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ను రెట్టింపు చేసింది. వారి నవ్వులు, హుందాతనం ఫ్యాన్స్‌కి మరింత కిక్ ఇచ్చాయి. పుష్ప 2 పై ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి భాగం పుష్ప: ది రైజ్‌తో సంచలనం సృష్టించిన ఈ జోడీ ఇప్పుడు మరింత శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ముందుకు రాబోతోంది.
ఈ రోజు జరగనున్న ప్రెస్ మీట్లో మూవీ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. ముంబైలో జరగనున్న ఈ ప్రెస్ మీట్ పుష్ప 2 కు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆరంభంగా నిలిచే అవకాశం ఉంది. అభిమానుల ఆసక్తిని పెంచడంలో భాగంగా మూవీ టీమ్ భారీ ప్లాన్లతో ముందుకు వస్తోంది. ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ ఈ ఈవెంట్‌ను మరింత స్పెషల్‌గా మారుస్తోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు పుష్ప 2 పై ఉన్న హైప్‌ను అమాంతం పెంచేశాయి. ఐమ్యాక్స్‌లో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. ఇక సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో మరో సంచలనం సృష్టించనుంది.
ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే 250 కోట్ల రేంజ్ లో బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వెయ్యి కోట్ల టార్గెట్ ను కూడా చాలా తొందరగానే అందుకుంటుంది అని మేకర్స్ నమ్ముతున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రస్తుతం నార్త్ ఆడియెన్స్ ద్వారా అర్ధమవుతుంది. ప్రభాస్ తరువాత బన్నీ బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతాడని అంటున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.