అట్లీ.. బన్నీ కండిషన్ ఏమిటంటే
పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ పాన్ ఇండియా లెవల్లో పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ పాన్ ఇండియా లెవల్లో పెరిగిపోయిన సంగతి తెలిసిందే. నెక్స్ట్స్ ఆయన ఎవరితో సినిమా చేస్తారన్న ఆసక్తి ఇండియా వైడ్‌గా ఉన్న సినీ ప్రియులు, అభిమానుల్లో విపరీతంగా పెరిగిపోయింది. సౌత్ టు నార్త్ టాప్ ఇండియన్ దర్శకనిర్మాతలు కూడా బన్నీతో సినిమా చేసేందుకు క్యూ కడుతన్నారు. తాజాగా దర్శకుడు అట్లీ కూడా కలిసి ఓ కథ చెప్పారు. మరి అట్లీ.. బన్నీని ఇంప్రెస్ చేయగలిగాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
వివరాళ్లోకి వెళితే.. పుష్ప తర్వాత దర్శకులు కొరటల శివ, వేణు శ్రీరామ్ బన్నీని కలిశారు. తమ కథలకు సంబంధించి సింగిల్ లైన్ స్టోరీ చెప్పి అల్లు అర్జున్ను ఇంప్రెస్ కూడా చేశారు. కానీ బౌండెడ్ స్క్రిప్ట్‌తో చేయలేకపోయారు. పైగా అప్పటికే కొరటాల ఆచార్యతో భారీ డిజాస్టర్‌ను అందుకోవడం, వేణు శ్రీరామ్ చేసిన వకీల్ సాబ్.. బన్నీ డెసిషన్‌ను మార్చేశాయి.
ఆ తర్వాత చాలా మందే దర్శకులు తమ కథలతో ఐకాన్ స్టార్‌ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, మురగదాస్, లింగుస్వామి, పుష్కర్ అండ్ గాయత్రి, జైలర్ ఫేమ్ నెల్సన్ కుమార్ ఇంకా పలువురు దర్శకుడు కూడా బన్నీని కలిశారు. కానీ ఎవరు కూడా బన్నీ పెట్టిన ఎగ్జామ్‌లో పాస్ కాలేకపోయారు.
ప్రస్తుతం జవాన్‌తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అట్లీ పేరు గట్టిగా వినిపిస్తోంది. వీరిద్దరు ఇప్పటికే కలిసి కథపై చర్చలు కూడా జరిపారు. తాజాగా ముంబయిలో కూడా కలిశారు. దాదాపు సినిమా ఖరారైపోయిందని అంటున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుందని చెబుతున్నారు. అయినప్పటికీ అట్లీకి మరో పరీక్ష ఉంది. అతడు.. అల్లు అర్జున్ను తన బౌండెడ్ స్క్రిప్ట్‌తో మెప్పించగలగాలి. లేదంటే అల్లు అర్జున్.. సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా.. సినిమాను పక్కన పెట్టడానికి వెనకాడడని అర్థమవుతోంది.
ఎందుకంటే పుష్ప సక్సెస్ తర్వాత బన్నీపై బాధ్యత మరింత పెరిగింది. పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించేలా కథలను ఎంచుకోని సినిమాలు చేయాలి. కాబట్టి బన్నీ.. తన స్టార్ డమ్‌ను దృష్టిలో పెట్టుకుని.. కథలను ఎంచుకునే పనిలో ఉన్నారు. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. చూడాలి మరి అట్లీ.. అల్లు అర్జున్ టెస్ట్‌ను పాస్ అవుతారో లేదో..