పుష్ప 2 లీక్స్.. వెండితెరపై బీభత్సమే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా పుష్ప2. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది

Update: 2023-09-07 07:22 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా పుష్ప2. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వచ్చే ఏడాది మార్చిలో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం అయితే జరుగుతోంది.

కాగా, తాజాగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యే ఓ వీడియో బయటకు వచ్చింది. పుష్ప2 లొకేషన్ నుంచి ఓ వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. అందులో కొన్ని వందల లారీలు ఉన్నాయి. పుష్ప మొదటి భాగం చూసినవారికి ఈ లారీలు ఎందుకు అనే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. పుష్ప ఈ లారీల్లోనే ఎర్ర చందనం దుంగలను తలరిస్తూ ఉంటారు.

కాగా, ఈ వీడియో చూసిన తర్వాత, సెకండ్ పార్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మొదటి భాగంలో మించిన స్మగ్లింగ్ ఐడియాలను ఇందులో చూపించనున్నారనే విషయం అర్థమౌతోంది. పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్ నటనతో పాటు, ఈ డిఫరెంట్ స్మగ్లింగ్ ఐడియాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సెకండ్ పార్ట్ అంతకు మించి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక, పుష్ప మూవీలో అల్లు అర్జున్ నటను అందరూ ఫిదా అయిపోయారు. అందుకే ఏకంగా ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చింది. టాలీవుడ్ లో ఉత్తమ జాతీయ నటుడి అవార్డు అందుకున్న ఏకైక నటుడు అల్లు అర్జునే కావడం విశేషం.

ఇక, ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. మొదటి పార్ట్ లో ఆయన నటన అందరికీ నచ్చింది. ఆయన కోసం కూడా రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నవారు కూడా ఉన్నారు. ఇక, సునీల్, అనసూయ లాంటివారు సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags:    

Similar News