పుష్ప 2: వెయ్యి కోట్ల హడావుడి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ పుష్ప ది రూల్.

Update: 2023-09-05 04:58 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ పుష్ప ది రూల్. పుష్పకి సీక్వెల్ గా సిద్ధమవుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. మొదటి సినిమా కంటే బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలనే కసితో సుకుమార్ ఈ మూవీపై పని చేస్తున్నారు. అలాగే పుష్పరాజ్ పాత్రకి నేషనల్ అవార్డు రావడంతో బన్నీ మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి.

పుష్ప 2తో వాటిని కచ్చితంగా అందుకోవాలి. ఆ దిశగానే బన్నీ చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఈ మూవీ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ కూడా పుష్ప పాటలకి గాను నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు మరింత పెద్ద బాద్యత అతనిపైన ఉంది. పుష్ప ది రూల్ మూవీ టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి అంచనాలు పెంచేసింది. కచ్చితంగా టాలీవుడ్ నుంచి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే మూవీ ఇది అవుతుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ సర్కిల్ లో ఈ సినిమాకి సంబంధించి ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఓ పెద్ద డిస్టిబ్యూటర్ పుష్ప మొత్తం రైట్స్ కోసం ఏకంగా వెయ్యి కోట్ల ఆఫర్ చేసారంట. అయితే అంత పెద్ద మొత్తం ఆఫర్ చేసిన నిర్మాతలు మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా లేరని టాక్ నడుస్తోంది. మూవీ రిలీజ్ కి ముందు మాత్రమే బిజినెస్ గురించి ఆలోచించాలని మైత్రీ నిర్మాతలు ఫిక్స్ అయ్యారంట

సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో పుష్ప ది రూల్ మూవీని మైత్రీవారు నిర్మిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే మొదటి సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లే. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సినిమాపైన పాజిటివ్ బజ్ ఉండటం, అంతకుమించి పుష్ప 1కి రెండు నేషనల్ అవార్డులు రావడం వలన పుష్ప2పైన హైప్ అమాంతం పెరిగిపోయింది.

నార్త్ ఇండియన్ బెల్ట్ లో అయితే పుష్ప ది రూల్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన దానిని వైరల్ చేస్తున్నారు. డిజిటల్ రైట్స్ రూపంలో కూడా పెద్ద సంస్థల నుంచి పోటీ ఉంది. భారీ మొత్తంలోనే ఆఫర్స్ వస్తున్నాయి. మరి ఈ అంచనాలని పుష్ప రాజ్ ఏ మేరకు అందుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News