7 త్ క్లాస్ లో సాయిపల్లవి రాసిన ప్రేమలేఖ!
స్కూల్..కాలేజీ డేస్ లో ఏదో ఒక సమయంలో వయసులో ప్రేమలో పడినవారెంతో మంది.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి వయసుతో సంబంధం లేదు. వయసును బట్టి అది ఆకర్షణ..ప్రేమ అన్నది కన్పమ్ అవుతుంది. ప్రేమకి వయసుతో సంబంధం లేదు. అందులోనూ తెలిసితెలియని వయసులో పుట్టిన ప్రేమ మరింత స్వచ్ఛంగా ఉంటుందంటారు. ఇలాంటి లవ్ స్టోరీలు చాలా మంది హీరోయిన్లకు ఉన్నాయి. స్కూల్..కాలేజీ డేస్ లో ఏదో ఒక సమయంలో వయసులో ప్రేమలో పడినవారెంతో మంది.
మరి అలాంటి లవ్ స్టోరీ సాయి పల్లవికి ఉందా? స్కూల్ డేస్ లో ఆమె సైతం ప్రేమ లేఖలు రాసిందా? అంటే అవుననే అంటోంది. ఆ కహానీ ఏంటో ఆమె మాటల్లోనో..`నేను రాసుకున్న ప్రేమలేఖ ఇప్పటికీ గుర్తుంది. అదే నా చివరి ప్రేమలేఖ కూడా అనుకోండి. అప్పుడు నేను ఏడవ తరగతి చదువుతున్నాను. ఆ వయసులో స్కూల్లో ఓ అబ్బాయి బాగా నచ్చాడు. ఆ విషయాన్ని అతడికి ఎలా చెప్పాలో తెలియక లవ్ లెటర్ రాసాను.
కానీ ఆ లెటర్ ఆ అబ్బాయికి ఇచ్చే ధైర్యం నాలో లేదు. చివరికి ఆ లేఖ ఇవ్వలేకపోయాను. ఇంట్లోనే ఉండిపోయింది. ఓ రోజు ఆ లెటర్ ఇంట్లో వాళ్లు చూసారు. బాగా తిట్టారు...కొట్టారు. దీంతో మళ్లీ అలాంటి లెటర్ల జోలికి వెళ్లడం మానేసాను. ఆ తిట్లు..దెబ్బలు ఇంకా బాగా గుర్తున్నాయి. ఆ వయసులో అలాంటి లేఖ ఎలా రాయగలిగాను అని ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడా సంఘటన తలుచుకుంటే నవ్వొస్తుంది.
ఆ పనిచేసింది నేనేనా? అని ఆశ్చర్యంగా కలుగుతుంది. జీవితంలో గుర్తుంచుకునే సంఘటనలు ఇలాంటి మెమోరీసే అనిపిస్తుంది` అని తెలిపింది. అప్పటి నుంచి సాయి పల్లవి ఎవరితోనూ ప్రేమలో పడినట్లు లేదు. స్కూల్ నుంచి కాలేజీకి వెళ్లింది. అక్కడ నుంచి హయ్యర్ స్టడీస్. అటుపై సినిమాల్లోకి వచ్చింది. కానీ ఇంతవరకూ ఎవరితోనూ ప్రేమలో పడింది లేదు. ఇప్పుడు తానే స్వయంగా చెల్లికి పెళ్లి చేసింది. మరి తన పెళ్లి సంగతేంటి? అంటే అప్పుడెప్పుడే పెళ్లి చేసుకోననని..తల్లిదండ్రుల దగ్గరే ఉంటానని తెలిపింది.