అంబానీ పెళ్లి: క్రూయిజ్ షిప్‌లోకి ఏం వెళ్లాయో చూస్తే కళ్లు తిరుగుతాయి!
ప్రస్తుతం యూరప్‌లో క్రూయిజ్ షిప్‌లో తమ రెండవ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో చిల్లింగ్ మూవ్ మెంట్స్ ని ఆస్వాధిస్తున్నారు.
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ద్వితీయ ప్రీవెడ్డింగ్ వేడుక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకల కోసం 1000 కోట్లు ఖర్చు చేసిన అంబానీలు, ఈసారి రెండో ప్రీవెడ్డింగ్ కోసం కూడా అంతకు ఎంతమాత్రం తగ్గకుండా ఖర్చు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి క్రూయిజ్ షిప్‌లో అంబానీల పార్టీ విలాసం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రస్తుతం యూరప్‌లో క్రూయిజ్ షిప్‌లో తమ రెండవ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో చిల్లింగ్ మూవ్ మెంట్స్ ని ఆస్వాధిస్తున్నారు. బాలీవుడ్ నుంచి దిగ్గజాలు ఇప్పటికే క్రూయిజ్ లో చేరిపోయి పార్టీలో మునిగిపోయారు. క్రూయిజ్‌లో ఉన్న 800 మంది అతిథులు పార్టీని ఎంజాయ్ చేస్తూ కచేరీలో మైమరిచిపోతున్నారు. ఈ షిప్ ప్రయాణం యూరప్ సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతోంది.
ఇంతలోనే ఇప్పుడు ఈ షిప్ బయల్దేరినప్పటి వీడియో ఒకటి అంతర్జాలంలో సునామీలా మారింది. ఇంటర్నెట్ లో వైరల్ గా షేర్ అవుతున్న ఈ క్రూయిజ్ షిప్ లావిష్‌నెస్, విజువల్ గ్రాండియారిటీ, రిచ్ అప్పియరెన్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ షిప్ లోకి వందలాది బస్సులు, కార్లు వచ్చి అతిథులను దించి వెళుతుండడం చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. షిప్ లోపలి ప్రదేశం ఎంతో విశాలంగా కనిపిస్తోంది. ఎటు చూసినా సువిశాలమైన స్థలంతో ఒక భారీ స్టేడియమ్‌ని తలపిస్తోంది. ఇందులో వేలాది చైర్లతో సిట్టింగ్ ఏర్పాటు ఉన్న ఆడిటోరియం ప్రధాన హైలైట్ గా నిలుస్తోంది. ఇక్కడే సెలబ్రిటీల ప్రదర్శనలు కీలక ఈవెంట్లు జరుగుతాయని అర్థమవుతోంది.
ఇక ఈ క్రూయిజ్ షిప్‌లో మెనూ అందించేది ఎవరో తెలుసా? బెంగుళూరు సంస్థ రామేశ్వరం కేఫ్ ఈ ఖరీదైన విహారయాత్రలో అతిథులకు దక్షిణ భారత రుచికరమైన వంటకాలు, ఫిల్టర్ కాఫీని అందిస్తోందని సమాచారం. ఈ విషయాన్ని రామేశ్వరం కేఫ్ ఇన్‌స్టాలో వెల్లడించింది. క్రూయిజ్ నుండి తమ బృందం ఈ ఫోటోలను షేర్ చేస్తోంది.
స్పెయిన్‌లోని @celebritycruises లో జరుగుతున్న ప్రపంచంలోని అత్యుత్తమ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగమైనందుకు సంతోషిస్తున్నాము. @therameshwaramcafe దక్షిణాది నుండి ఉత్తమమైన దక్షిణ భారత ఆహారాన్ని అందించే ఏకైక రెస్టారెంట్ అని పేర్కొంది.
తాజా కథనాల ప్రకారం, బాలీవుడ్ స్టార్లు రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ తదితరులు అటెండయ్యారు. వారికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. గాయకుడు గురు రంధవా ..అంతర్జాతీయ గాయని కాటి పెర్రీ .. బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ కు క్రూయిజ్‌లో ప్రదర్శన ఇచ్చారు.
జూలై 12న ముంబైలోని BKCలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ - రాధిక వివాహం జరగనుంది. ప్రధాన వేడుకలు శుక్రవారం నాడు అంటే జూలై 12న శుభ వివాహ వేడుకతో ప్రారంభమవుతాయి. శుభ ఆశీర్వాదం లేదా దైవిక ఆశీర్వాద వేడుక జూలై 13న జరుగుతుంది. ఆ తర్వాత మంగళ్ ఉత్సవ్ మరియు వివాహ రిసెప్షన్ జూలై 14న జరుగుతాయి.