'చాలా బాధగా ఉంది'.. రెహమాన్ కొడుకు సోషల్ మీడియా పోస్ట్

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సైరా భాను.. తమ 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే

Update: 2024-11-22 12:12 GMT

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సైరా భాను.. తమ 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తమ వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించామని, కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చిందని రెహమాన్ ఇటీవల నెట్టింట పోస్ట్ పెట్టారు.

దీంతో ఒక్కసారి రెహమాన్ ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. అదే రోజు.. రెహమాన్‌ టీమ్ లోని మోహిని దే కూడా తన భర్త నుంచి విడిపోతున్నానని వెల్లడించారు. దీంతో ఆ రెండు జంటల విడాకుల మధ్య ఏదో సంబంధం ఉందని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి.

వాటిపై సైరా భాను తరఫున న్యాయవాది ఇప్పటికే స్పందించి.. ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. పరస్పర అంగీకారంతో రెహమాన్ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కారణాలు చెప్పలేనని అన్నారు. కానీ రూమర్స్ ఆగలేదు. తాజాగా రెహమాన్ కొడుకు అమీన్ పోస్ట్ పెట్టారు.

తన తండ్రిపై వస్తున్న కొన్ని తప్పుడు వార్తలు చూస్తుంటే చాలా బాధగా ఉందని అమీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నాన్న ఒక లెజెండ్ అని, ఎన్నో ఏళ్ల నుంచి అద్భుతమైన మ్యూజిక్‌ ను అందించడమే కాదు.. ఎంతో మంది ప్రేమ, అభిమానాలను సొంతం చేసుకున్నారని రాసుకొచ్చారు అమీన్.

అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా రూమర్స్ స్ప్రెడ్ చేయడం చూస్తుంటే బాధగా ఉందని తెలిపారు. ఒక వ్యక్తి జీవితం గురించి మాట్లాడేటప్పుడు అసలు నిజమేంటో తెలుసుకోవాలని సూచించారు. దయచేసి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఇకనైనా ఆపండని కోరారు. ఆయనతోపాటు ఆయన వృత్తిని గౌరవిద్దామని అన్నారు.

మరోవైపు, రెహమాన్ కూతురు రహీమా సోషల్ మీడియాలో ఇంగ్లీష్ కొటేషన్ ను షేర్ చేశారు. ఎప్పుడైనా ద్వేషించే వాళ్ళు రూమర్స్ క్రియేట్ చేస్తారని, తెలివితక్కువ వాళ్ళు వ్యాప్తి చేస్తారని, పనికి రాని వాళ్ళు అంగీకరిస్తారని రాసుకొచ్చారు. అయితే రెహమాన్, సైరా భాను 1995లో వివాహం చేసుకోగా.. వారి వైవాహిక బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు ఖతీజా, అమీనా, రహీమా ఉన్నారు.

Tags:    

Similar News