ఏఎన్నార్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా.. ఎందుకు..?

తెలుగు సినిమా పరిశ్రమ రెండు కళ్లలో ఒకరు ఏఎన్నార్. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు ఆయనది.

Update: 2024-11-22 17:30 GMT

తెలుగు సినిమా పరిశ్రమ రెండు కళ్లలో ఒకరు ఏఎన్నార్. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు ఆయనది. తెలుగు సినిమాకు డ్యాన్స్ ని పరిచయం చేసింది ఆయనే. అక్కినేని పాత్ర చేశాడంటే ఆ పాత్రకు ప్రాణం పోసినట్టే. ఎన్నో వందల సినిమాల్లో.. రకరకాల పాత్రల్లో మెప్పించారు ఏఎన్నార్. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలు ఎప్పుడు ఆయన్ను మనకు ఆయన్ను గుర్తు చేస్తాయి. ఆయన సినిమాలు ఆయన జ్ఞాపకాలుగా పులకరింప చేస్తాయి.

ఏఎన్నార్ శత జయంతి సందర్భంగా ఈమధ్యనే ఏఎన్నార్ అవార్డుని మెగాస్టార్ చిరంజీవికి అందచేశారు అక్కినేని ఫ్యామిలీ. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ అవార్డ్ ఫంక్షన్ కు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఐతే ప్రస్తుతం ఐ.ఎఫ్.ఎఫ్.ఐ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరుగుతుంది. ఆ వేడుకల్లో ఏఎన్నార్ శతజయంతి కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ నుంచి కింగ్ నాగర్జున, నాగ చైతన్య, శోభిత మరికొంతమంది అక్కినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకలకు వచ్చారు.

ఏఎన్నార్ గురించి నాగార్జున ఇచ్చిన స్పీచ్ అందరినీ అలరించింది. సాధారణ రైతు బిడ్డ నుంచి గొప్ప నటుడి స్థాయికి ఏఎన్నార్ సినీ ప్రయాణం గురించి నాగారున చెప్పారు. రైల్వేస్టేషన్ లో ఏఎన్నార్ ని చూసి ఘంటసాల బలరామయ్య తో పరిచయమే ఆయన్ను సినీ పరిశ్రమకు వచ్చేలా చేసిందని అప్పటి విషయాలను గుర్తుచేశారు. అంతేకాదు కెరీర్ మొదట్లో ఏఎన్నార్ వేసిన లేడీ పాత్రల వల్ల చాలామంది ఆయన్ను ఎద్దేవా చేశారని.. దానికి ఆయన ఎన్నోసార్లు బాధపడ్డారన్న విషయాన్ని చెప్పారు.

ఒకసారి ఆ అవమానాలను భరించలేక మెరెనా బీచ్ కి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నారట. ఐతే మళ్లీ పట్టుదలతో తనని చూసి నవ్విన వాళ్ల నోళ్లే తనని పొగిడేలా చేసుకున్నారు. ఆయన చేయని పాత్ర లేదన్న విధంగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు ఏఎన్నార్. ఎలాంటి పాత్ర అయినా కూడా అవలీలగా చేస్తూ ఆబాలగోపాలాన్ని తన నటనతో మెప్పించారు ఏఎన్నార్.

అంతేకాదు తెలుగు పరిశ్రమ మద్రాస్ నుంచి చెన్నై రావడం కోసం ఆయన చేసిన కృషి తెలిసిందే. అన్నపూర్ణ బ్యానర్ తో పరిశ్రమకు కావాల్సిన అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేశారు. ఏఎన్నార్ తో మొదలైన ఈ ప్రస్థానం ఆయన వారసుడు నాగార్జున కూడా అప్రతిహతంగా స్టార్ హీరోగా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News