నాగచైతన్య నెక్స్ట్.. 100 కోట్లు కాదు, అంతకుమించి!
ఈ మిస్టిక్ థ్రిల్లర్ కోసం నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్‌ను కేటాయించారని తెలుస్తోంది.
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలతో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ప్రతీ సినిమాలో కూడా తన పాత్ర భిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత ఖరీదైన సినిమాగా తెరకెక్కుతున్న తండేల్ కు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో పూర్తవ్వబోతోంది. జీఏ2 పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం 2024 ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది.
తండేల్ పూర్తి కాగానే, నాగచైతన్య తన తదుపరి సినిమాను కూడా వీలైనంత తొందరగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన తదుపరి సినిమాను విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 12న హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక సినిమాలో మీనాక్షి చౌదరి, పూజా హెగ్డే కథానాయికలుగా కనిపించబోతున్నారని సమాచారం. సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నా, అనేక రకాల అంశాలు అంచనాల స్థాయిని పెంచుతున్నాయి.
ఈ మిస్టిక్ థ్రిల్లర్ కోసం నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్‌ను కేటాయించారని తెలుస్తోంది. సినిమా కంటెంట్ మీద నమ్మకంతో సుమారు రూ. 110 కోట్లను ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇందులో రూ. 30 కోట్లను ప్రత్యేకంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం వినియోగించనున్నారు. సినిమా ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి అనుభవాన్ని అందించేందుకు వీలుగా, విజువల్ ఎఫెక్ట్స్ పనులు నిశితంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
నాగచైతన్య తన కెరీర్ లోనే మొదటిసారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ను టచ్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది. సినిమా షూటింగ్‌కి ముందు ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాలో నటీనటుల వివరాలతో పాటు సాంకేతిక బృందం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ముఖ్యంగా ఈ చిత్రం యొక్క ప్రధానమైన భాగాన్ని ఉత్తర భారతదేశంలోని పలు డిఫరెంట్ లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు సమాచారం.
నాగచైతన్య కెరీర్లో ఇదే అత్యంత ఖరీదైన సినిమా కావడం విశేషం. సినిమా మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుందని చెప్పిన చిత్ర బృందం, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రీ-ప్రొడక్షన్ పనుల్లోనే భారీ బడ్జెట్‌ను వెచ్చించడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. ఇక ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.