సైమాలో అదిరే సీన్: తమ్ముడికి అవార్డు ఇచ్చిన అన్న

సైమా 2024అవార్డుల ఫంక్షన్ కార్యక్రమం దుబాయ్ లో జరిగిన సంగతి తెలిసిందే. మన సమయం కంటే గంటన్నర వెనుక ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-15 04:07 GMT

సైమా 2024అవార్డుల ఫంక్షన్ కార్యక్రమం దుబాయ్ లో జరిగిన సంగతి తెలిసిందే. మన సమయం కంటే గంటన్నర వెనుక ఉంటుందన్న సంగతి తెలిసిందే. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అవార్డుల ఫంక్షన్ పూర్తైంది. మొదటిరోజు తెలుగు.. కన్నడ సినిమా అవార్డుల ప్రకటన.. ప్రధానోత్సవం జరగ్గా.. ఆదివారం తమిళం.. మలయాళం చిత్రాల అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది.

శనివారం జరిగిన సైమా 2024 అవార్డుల ప్రధానోత్సవంలో ఒక సీన్ అదిరేలా మారింది. సో స్పెషల్ అన్నట్లుగా ఈ సీన్ లోకి వెళితే.. సంచలన హీరోగా యూత్ లో క్రేజ్ ఉన్న విజయ దేవరకొండ ఈ కార్యక్రమానికి హైలెట్ గా నిలిచారు. అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ నటుడు (క్రిటిక్స్) గా ఆనంద్ దేవరకొండకు దక్కింది. దీంతో.. ఈ అవార్డును వేదిక మీదకు వెళ్లిన అతనికి.. తన అన్న విజయ దేవరకొండ చేతుల మీదుగా అవార్డును తీసుకోవటం ఆసక్తికరంగ మారింది.

అన్న.. తన తమ్ముడికి ఉత్తమ నటుడి అవార్డును తీసుకోవటానికి మించిన ఆనందం ఇంకేం ఉంటుంది? అందుకు తగ్గట్లే.. తన సోదరుడికి తన చేతుల మీదుగా అవార్డు ఇచ్చిన వైనం విజయ్ దేవరకొండకు ఆనందానికి గురి చేయగా.. తన అన్న చేతలు మీదుగా ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకోవటం.. అందుకోవటం కాస్తంత ఎమోషనల్ గా మారింది. మొత్తానికి శనివారం సైమా 2024 అవార్డుల ఫంక్షన్ లో ఈ సీన్ హైలెట్ గా చెబుతున్నారు.

Tags:    

Similar News