`రోజా` సినిమాలో తొలి హీరో నేనే!
అంతటి అద్భుతమైన రొమాన్స్ పండించడం వాళ్లకే సాధ్యమని ప్రూవ్ చేసారు ఆసినిమాతో అరవింద్ స్వామికి లవర్ బోయ్ ఇమేజ్ ఏర్పడింది.
అరవింద్ స్వామి-మణిరత్నం కాంబినేషన్ లో రిలీజ్ అయిన `రోజా` సంచలనం గురించి చెప్పాల్సిన పనిలేదు. వాళ్లిద్దరి కెరీర్ లో అదో క్లాసిక్ హిట్. `గీతాంజలి` తర్వాత మణిసార్ నుంచి రిలీజ్ అయిన మరో క్లాసిక్ అది. అరవింద్ స్వామి-మధుబాల మద్య రొమాంటిక్ సన్నివేశాలు ఇప్పటికీ కళ్ల ముందు అలా కదులుతూనే ఉన్నాయి. అంతటి అద్భుతమైన రొమాన్స్ పండించడం వాళ్లకే సాధ్యమని ప్రూవ్ చేసారు. ఆసినిమాతో అరవింద్ స్వామికి లవర్ బోయ్ ఇమేజ్ ఏర్పడింది.
దేశం మొత్తం బాగా ఫేమస్ అయ్యాడు. అయితే అందులో తొలి హీరో అరవింద్ స్వామి కాదు ? అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఛాన్స్ వచ్చింది మొదట నటుడు ఆనంద్ కి అట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. సీనియర్ నటుడు ఆనంద్ సుపరిచిమతే. మంచి అందగాడు. నిన్నటి తరం హీరో. ఇప్పుడాయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన `దొంగ దొంగ` సినిమా ఆయన కెరియర్ లో కీలకమైన సినిమా.
ఆనంద్ మాట్లాడుతూ, ` విక్రమ్ .. కార్తీక్ .. రెహమాన్ (రఘు)తో కలిసి నా ప్రయాణం కొనసాగింది. వాళ్లంతా ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్స్. కెరియర్ మొదట్లో పెద్ద దర్శకుల సినిమాలలో చేయడం అదృష్టం తప్ప మరొకటి కాదు. నేను తెలుగు .. తమిళ .. మలయాళ సినిమాలు చేస్తూ వెళుతున్నాను. ఆ ధైర్యంతో సొంత ఇంటి నిర్మాణం మొదలుపెట్టాను. ఆశ్చర్యం ఏమిటంటే ఈ మూడు భాషలలో నాకు అవకాశాలు ఆగిపోయాయి.
అలా మూడేళ్లపాటు ఒక్క ఛాన్స్ రాకపోవడం నాకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకూ అలాంటి ఒక పరిస్థితిని చూడలేదు. అలా ఎందుకు జరిగిందనేది నాకు ఇప్పటికీ తెలియలేదు. నా జీవితంలో నేను బాధపడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. `రోజా` సినిమాలో హీరోగా నేను చేయవలసింది. కానీ ఆ ఛాన్స్ అరవింద్ స్వామికి వెళ్లింది. ఎందుకు జరిగిందో నాకూ తెలియదు. తమిళంలో దివ్యభారతి తొలి సినిమా హీరో నేనే. అప్పుడు నాకు 19 ఏళ్లు` అని అన్నారు.