ఆ డైరెక్టర్ పేరు గర్వంగా చెప్పుకుంటోన్న ఫేమస్ విలన్!
సరిగ్గా అదే సమయంలో సందీప్ రెడ్డి వంగా తాను రాసుకున్న అబ్రార్ పాత్రతకు బాబి డియోల్ అయితే బాగుంటుందని ఎంపిక చేసాడు.
'బాబి డియోల్' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. 'యానిమల్' అనే హిందీ సినిమాతో పాన్ ఇండియాలో సంచలనం అయిన నటుడు. ఆ ఒక్క విజయం బాబి డియోల్ జీవితాన్నే మార్చేసింది. నటుడిగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పుడు తెలుగు హీరోల విలన్ ఎవరు? అంటే బాబి పేరు చెబుతున్నారంతా.
అదేంటి బాబి డియోల్ బాలీవుడ్ లో చాలా సీనియర్ ఆర్టిస్ట్ కదా? ఆయన గురించి కొత్తగా పరిచయం దేనికి? బాబి డియోల్ కి తెలుగు డైరెక్టర్ అవకాశం ఇవ్వడం ఏంటి? కొత్తగా ఫేమస్ అవ్వడం ఏంటి? అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. నిజమే బాబి డియోల్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలవుతుంది. నటుడిగా చాలా సినిమాలు చేసాడు. 1977లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించినా? అతడి కెరీర్ మాత్రం అంత సాఫీగా సాగలేదని తెలుస్తుంది.
చెప్పుకోవడానికి చాలా సినిమాలున్నాయి. కానీ సక్సెస్ లు మాత్రం కనిపించలేదు. అలాగని పూర్తిగా విజయాలకు దూరంగా లేడు. కొన్ని చెప్పుకోదగ్గ విజయాలున్నాయి. కానీ కెరీర్ లో మాత్రం బిజీ నటుడిగా మారలేదు. 'యానిమల్' విజయంతోనే ఎంతో ఫేమస్ అయ్యాడు. అయితే అవకాశాలు లేని సమయంలో బాబి డియోల్ ఎన్నో అవమానాలకు గురైనట్లు తెలుస్తోంది. సొంత భార్య, పిల్లలు కూడా సినిమాలు చేయడం లేదంటి? ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు? అనే విమర్శలు సైతం ఎదుర్కున్నట్లు తెలుస్తోంది.
సెకెండ్ ఇన్నింగ్స్ తర్వాత బాబి డియోల్ కంబ్యాక్ అవ్వడానికి చాలా సమయం పట్టిందన్న విషయం దర్శకుడు బాబి మాటల్ని బట్టి తెలుస్తోంది. సెకెండ్ ఇన్నింగ్స్ కోసం మళ్లీ యధావిధిగా స్టూడయోలు చుట్టూ అవకాశాల కోసం తిరిగాడుట. కానీ ఎవ్వరూ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదుట. సరిగ్గా అదే సమయంలో సందీప్ రెడ్డి వంగా తాను రాసుకున్న అబ్రార్ పాత్రతకు బాబి డియోల్ అయితే బాగుంటుందని ఎంపిక చేసాడు. సందీప్ ఎంట్రీ తర్వాత తన జీవితమే మారిపోయిందని బాబి డియోల్ ఎంతో గర్వంగా సందీప్ పేరు చెబుతున్నాడుట. ప్రస్తుతం బాబి డియోల్ 'డాకు మహారాజ్' లో నటిస్తున్నాడు. ఇంకా మరికొన్ని సౌత్ సినిమాలకు సైన్ చేసాడు. హౌస్ ఫుల్-5, ఆల్పాలోనూ నటిస్తున్నాడు.