అందుకు ఒప్పుకోన‌న్న స‌హాయ‌నటి

బుల్లితెర లేదా పెద్ద‌తెర ప్రపంచంలో నటీనటులు తమ సహనాన్ని పరీక్షించే సవాళ్లను ఏదో ఒక స‌మ‌యంలో క‌చ్ఛితంగా ఎదుర్కోవాల్సిందే.

Update: 2024-12-25 20:30 GMT

బుల్లితెర లేదా పెద్ద‌తెర ప్రపంచంలో నటీనటులు తమ సహనాన్ని పరీక్షించే సవాళ్లను ఏదో ఒక స‌మ‌యంలో క‌చ్ఛితంగా ఎదుర్కోవాల్సిందే. ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ ఇలాంటి ప‌రిస్థితులు ఉంటాయి. కానీ అన్నిటినీ అధిగ‌మించి త‌మ‌ను తాము న‌టిగా ఎలివేట్ చేసుకునేందుకు వారు చేసే కృషి, త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి వారిలో రిధి డోగ్రా పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది. రోజువారీ టీవీ షోలు, రియాలిటీ షోలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలతో ఈ భామ త‌న‌ను తాను నిరూపించుకుంది. అటుపై పెద్ద తెర ఆరంగేట్రం చేసాక‌ స‌హాయ‌న‌టిగా చాలా స‌వాళ్లను ఎదుర్కొంది. ఎట్ట‌కేల‌కు న‌టిగా త‌న‌ను తాను నిరూపించుకుంది.

ఇటీవ‌లే స‌బర్మ‌తి రిపోర్ట్ చిత్రంలో స‌హాయ‌క పాత్ర‌లో క‌నిపించిన రిధి అంత‌కుముందు షారూఖ్ న‌టించిన జ‌వాన్ లోను ముఖ్య‌మైన‌ పాత్ర‌లో క‌నిపించింది. అసుర్‌లో నుస్రత్ గా.. స్టార్ ప్లస్ రెస్పెక్ట్ లో ప్రియాగా త‌న‌ పాత్రలతో ఆక‌ట్టుకుంది. బుల్లితెర రంగంలో పాపుల‌రై వెండితెరపైనా రిధి వెలుగుతోంది. ఇటీవల తన జీవితంలోని ఓ త్రోబ్యాక్ ఘటన గురించి రిధి ఓపెనైంది.

పింక్‌విల్లాతో ప్రత్యేక ఇంటర్వ్యూలో త‌న‌ను ఓ ద‌ర్శ‌కుడు చిన్న చూపు చూస్తూ కామెంట్ చేసాడ‌ని తెలిపింది. అయితే తాను అత‌డిని ఎదుర్కొని పోరాడాన‌ని తెలిపింది. ఎవరైనా తనను చిన్నబుచ్చుతూ లేదా అవ‌మానిస్తూ మాట్లాడినప్పుడల్లా తాను ఎదురు వెళ‌తాన‌ని రిధి డోగ్రా చెప్పింది. ఒక షో సెట్‌లో ద‌ర్శ‌కుడు త‌న‌ను నిరుత్సాహ‌ప‌రిచాడు. ``ఆమెకు ఆస్కార్ అవార్డులు వస్తాయి`` అని కామెంట్ చేసాడ‌ట‌. అత‌డు ఐశ్వ‌ర్యారాయ్ కాదు అని త‌న‌ను కామెంట్ చేయ‌గానే, నువ్వు మ‌ణిరత్నం కాదు అని అతడిపై రివ‌ర్స్ పంచ్ వేసింద‌ట‌. రిధి బాలీవుడ్ లో చాలా భారీ ప్రాజెక్టుల్లో న‌టించింది. కానీ చిట్టి పొట్టి నిక్క‌ర్లు, బికినీలు వేయాలంటే త‌న వ‌ల్ల కాద‌ని సూటిగా చెప్పేస్తాన‌ని రిధి నిర్మొహ‌మాటంగా తెలిపింది.

Tags:    

Similar News