టాలీవుడ్ పై పర భాషా నటుల ప్రేమ ఇలా!
నేడు తెలుగు సినిమా ఏ స్థాయికి చేరిందన్నది చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియాలో టాలీవుడ్ ఇప్పుడో సంచలనం.
నేడు తెలుగు సినిమా ఏ స్థాయికి చేరిందన్నది చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియాలో టాలీవుడ్ ఇప్పుడో సంచలనం. `బాహుబలి`,` ఆర్ ఆర్ ఆర్`, `కార్తికేయ-1`, `హనుమాన్`, `సలార్`, `పుష్ప-2` లాంటి చిత్రాలు ఇండియాలోనే టాలీవుడ్ ని తీసుకెళ్లి నెంబవర్ స్థానంలో కూర్చబెట్టాయి. `పుష్ప-2` బాలీవుడ్ వసూళ్లతో ఖాన్ లు..కపూర్ లే నోరెళ్లబెడుతున్నారు. దేశంలో ఏ పరిశ్రమకి సాధ్యం కాని ఆస్కార్ అవార్డు టాలీవుడ్ పరిశ్రమ తీసుకొచ్చి దేశాన్ని మరోసారి ప్రపంచ పటంలో నిలిపింది.
దేశం మీసం మెలేసేలా చేసింది టాలీవుడ్. ఇంత పేరొచ్చినా? టాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఇలాంటి వాటి గురించి పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. మా పనులు మాట్లాడుతాయి తప్ప మేము కాదు అన్నట్లే సన్నివేశం కనిపిస్తుంది. ఈ విషయంలో స్వభాష నటులు సైలెంట్ గా ఉన్న పక్క పరిశ్రమలు మాత్రం ఆకాశానికి ఎత్తే స్తున్నాయి. ఇటీవలే కన్నడ నటుడు ఉపేంద్ర టాలీవుడ్ సినిమా ఇండియాని కాదు ఏకంగా వరల్డ్ నే షేక్ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసారు.
అవి నెట్టింట జోరుగా వైరల్ అయ్యాయి. టాలీవుడ్ గొప్పతనం గురించి ఓ కన్నట నటుడు మాట్లాడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అది మరువక ముంద ఈసారి ఏకంగా మాలీవుడ్ లెజెండ్ మోహన్ లాల్ కూడా నేను సైతం అన్నారు. `టాలీవుడ్ ఇప్పుడు పెద్ద పరిశ్రమగా ఎదిగింది. ఇక్కడి ప్రేక్షకులు సినిమాను ఎంతో గౌరవిస్తారు. ప్రేమి స్తారు. ఎన్నో అద్భుతమైన విజయాలు అందిస్తున్నారు. ఇటీవలే పుష్ప-2తో మరోసారి అది రుజువైంద`న్నారు.
ఇలా వరుసగా ఇతర పరిశ్రమల నటులు టాలీవుడ్ గురించి మాట్లాడటం విశేషం. అయితే పక్కనే ఉన్న కొందరు కోలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం తెలుగు సినిమా సక్సెస్ గురించి మాట్లాడటం లేదు. రజనీకాంత్, సూర్య, కార్తీ లాంటలి వారు తప్ప చాలా మంది సైలెంట్ గానే ఉన్నారు. ఇటీవలే బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ కూడా పుష్ప-2 సక్సెస్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.