ఒళ్లంతా పురికొస చుట్టుకుంది.. ఇదేమి ఫ్యాషన్ ట్రిప్తీ?
ఒక సాధారణ పురికొస (తాడు)ను ఉపయోగించి నెట్టెడ్ దుస్తుల్ని తయారు చేయడమే గాక, దీనికి యూత్ లో పాపులారిటీ ఉన్న ట్రిప్తి దిమ్రీతో ప్రచారం చేయడం ఆశ్చర్యపరుస్తోంది.;
ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లో నేటితరం చాలా అప్ గ్రేడ్ అవుతోంది. ఇప్పుడు అలాంటి ఒక కొత్త ఫ్యాషన్ ని పరిచయం చేసి ఆశ్చర్యపరిచింది `యానిమల్` బ్యూటీ ట్రిప్తి దిమ్రీ. నిజానికి అల్ట్రా స్టైలిష్ మోడ్రన్ డిజైనర్ లుక్ కోసం సిల్క్ కాటన్, ఊల్ లేదా ఇంకేదైనా ఖరీదైన వస్త్రాన్ని ఉపయోగించడం చూశాం. కానీ దానికి మించి క్రియేటివిటీ ఆశ్చర్యపరుస్తోంది.
ఒక సాధారణ పురికొస (తాడు)ను ఉపయోగించి నెట్టెడ్ దుస్తుల్ని తయారు చేయడమే గాక, దీనికి యూత్ లో పాపులారిటీ ఉన్న ట్రిప్తి దిమ్రీతో ప్రచారం చేయడం ఆశ్చర్యపరుస్తోంది. పురికొస దుస్తుల్లో అర్థనగ్నంగా ట్రిప్తి ఇచ్చిన ఫోజులు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ ఫ్యాషన్ సెన్స్ చూశాక కాదేదీ ఫ్యాషన్ కనర్హం! అంటూ పోయెట్రీ చెబుతోంది యూత్.
ఇటీవల కాస్మో ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రిప్టి ఆసక్తికర విషయాలను ముచ్చటించింది. ముఖ్యంగా తాను చిన్నప్పుడు ఎలా పెరిగిందో మాట్లాడింది. తనకు బాల్యంలో ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకూ ఆటలాడుకునేదానిని అని ట్రిప్తి చెప్పింది. అలాగే తనకు పల్లెటూరి మట్టివాసన తెలుసు అని, వాగు వంకల్లో షికార్లు చేసానని కూడా ట్రిప్తి చెప్పింది. నేను విలేజ్ లో పిల్లలతో ఆడుకునేదానిని. వాగు నుండి నేరుగా నీటిని తాగేదానిని. అమ్మ మిట్టి (తడి బురద)తో ఇంటిని శుభ్రం చేయడం చూసాను. నేను అక్కడ కూర్చుని మట్టి వాసనను పీల్చుకునేదానిని.. కొన్నిసార్లు మట్టి కూడా తిన్నాను! అని తెలిపింది. ప్రకృతితో తన సహజీవనం గురించి ట్రిప్తి మురిపెంగా చెప్పుకొచ్చింది. నగర జీవనం కంటే పల్లెటూరిలో సహజసిద్ధమైన జీవితాన్ని ఆస్వాధిస్తానని ట్రిప్తి వెల్లడించింది.
ఉత్తరాఖండ్‌లోని ప్రశాంతమైన కొండల నుండి ముంబైలోని సందడిగా ఉండే ఫిల్మ్ సెట్‌ల వరకు ట్రిప్టి ప్రయాణం ఎంతో ఆసక్తికరం. తన పహాడీ వారసత్వం విలువల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ధడక్ 2 సహా పలు క్రేజీ ప్రాజెక్టుల్లో ట్రిప్తి నటిస్తోంది. ఆషిఖి 3లో నటించే అవకాశాన్ని కోల్పోయింది.