మరోసారి సామ్ హిట్ కాంబినేషన్
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ సమంత, టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ సమంత, టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వీరిద్దరి కలయికలో వచ్చిన ఓ బేబీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కానుందా అనే సందేహం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం.. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నందినీ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన కామెంట్స్.
"జన్మదిన శుభాకాంక్షలు నందినీ రెడ్డి. అందరి చూపు ఇప్పుడు నీ మీదే. ఇది గొప్ప ఏడాది అవుతుంది. ముందుకు సాగుదాం" అంటూ సమంత పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీనికి నందినీ రెడ్డి కూడా " మళ్లీ మొదలెట్టే క్షణం కోసం ఎదురుచూస్తున్నా. ముందుకు సాగుదాం" అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు వీరి మాటల్లో ఓ కొత్త సినిమా సంకేతం దాగుందా అని సినీ ప్రేమికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
సమంత కమర్షియల్ హీరోయిన్ గా సినిమాలు తగ్గించి ప్రస్తుతం కంటెంట్ ఉన్న లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. నెవ్వర్ బిఫోర్ అనేలా ప్రయోగాత్మకమైన పాత్రలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే కుటుంబ సినిమాతో పాటు హిందీలో ఒక వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. అయితే, నందినీ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకోవడం వల్ల సమంత మళ్లీ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుందా అనే ఉత్కంఠ నెలకొంది.
నందినీ రెడ్డి నాని హీరోగా చేసిన అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆ తరువాత జబర్దస్త్ అనే మరో సినిమా చేసింది. ఇక ఇందులో సిద్దార్థ్ హీరోగా నటించగా సమంత హీరోయిన్ గా నగించింది. ఇక ఆ తరువాత కళ్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలు చేసింది. చివరగా గత ఏడాది నందిని డైరెక్షన్ లో అన్ని మంచి శకునములే.. అనే సినిమా వచ్చింది.
ఇక నెక్స్ట్ సమంత ప్రధాన పాత్రలో ఓ కొత్త కథ సిద్ధం చేస్తోందని, అది పూర్తిగా భిన్నమైన కథాంశంగా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఓ బేబీ తరహాలో కాకుండా, మరింత విభిన్నమైన కథను నందినీ రెడ్డి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్తలన్నీ నిజమా లేక స్నేహితుల మధ్య జరిగే రెగ్యులర్ సంభాషణ మాత్రమేనా అన్నది అధికారిక ప్రకటన వచ్చేంత వరకు తెలియదు.