ట్రెడిషనల్ టచ్ తో పాయల్ మాయ

చిరునవ్వుతో మెరిసిపోతూ, ఒలకబోసిన గ్రేస్ ఆమెను మరింత అందంగా మార్చింది.;

Update: 2025-03-05 03:15 GMT

పాయల్ రాజ్‌పుత్ ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో అలరిస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతూ, అందరి హృదయాలను దోచుకుంటోంది. తాజా ఫోటోల్లో ఆమె స్కై బ్లూ కలర్ లెహంగా ధరించి, సంప్రదాయ ఆభరణాలతో రాజసంగా మెరిసిపోతోంది. మెహందీ, హారం, చెవి కమ్మలు, గాజులతో ఆమె రూపం సంప్రదాయ శోభను చాటుతోంది. చిరునవ్వుతో మెరిసిపోతూ, ఒలకబోసిన గ్రేస్ ఆమెను మరింత అందంగా మార్చింది.


ఈ ఫోటోల్లో పాయల్ స్టైలింగ్ చూసిన వారెవరైనా ఒక్కసారి మాత్రం ఫిదా అవ్వాల్సిందే. నీలి లెహంగా, వెండి అంచులు కలిగిన డిజైన్ ఆమె లుక్‌కు ప్రత్యేకమైన ఆకర్షణను జోడించాయి. గ్రీన్ బ్యాక్‌డ్రాప్ లో ఆమె ఫోటో షూట్ మరింత లైమ్‌లైట్‌లోకి తీసుకువచ్చింది. చేతినిండా మెహందీ, గాజులతో సంప్రదాయ అమ్మాయిగా దర్శనమిస్తున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


పాయల్ రాజ్‌పుత్ తెలుగు ప్రేక్షకులకు 'RX 100' సినిమాతో పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె నటన, పాత్ర హాట్ టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత 'వెంకీమామ', 'డిస్కో రాజా' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, తొలి సినిమా స్థాయిలో మరో విజయం రాలేదు. అలాగే మంగళవారం సినిమాలో చేసిన క్యారెక్టర్ కు మంచి గుర్తింపు దక్కింది కానీ ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఆమె గ్లామర్, ఫ్యాషన్ సెన్స్ మాత్రం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉంది.


ప్రస్తుతం పాయల్ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తోంది. కొత్త కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని భావిస్తున్న ఈ బ్యూటీ, త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్స్‌పై అధికారిక సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News