ఈయనేమో క్లాసు.. ఆయనేమో మాసు.. ఏం చేస్తారో..?
ఈ సినిమాకు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నట్టు టాక్. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.;
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం చేస్తున్న మాస్ జాతర సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం మరో సినిమాకు రెడీ అవుతున్నాడు రవితేజ. ఈసారి క్లాస్ డైరెక్టర్ తో రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తుంది. డైరెక్టర్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నట్టు టాక్. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.
సెకండ్ హ్యాండ్ అనే సినిమాతో డైరెక్టర్ గా తెలుగులో కెరీర్ మొదలు పెట్టిన కిషోర్ తిరుమల నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ నెక్స్ట్ ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి సినిమాలతో అలరించాడు. రెడ్ రీమేక్ డైరెక్ట్ చేసిన కిషోర్ 2022 లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేశాడు. 3 ఏళ్ల నుంచి నెక్స్ట్ సినిమా ప్రయత్నాల్లో ఉన్న కిషోర్ తిరుమల మాస్ మహారాజ్ ని ఒప్పించాడు.
రవితేజ మాస్ హీరో, కిషోర్ తిరుమల ఒక క్లాస్ డైరెక్టర్.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనేసరికి ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను దసరా మేకర్స్ నిర్మించడం సంథింగ్ స్పెషల్ గా మారింది. ఐతే ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. ఐతే అనార్కలి అనేది ఒక డిఫరెంట్ టైటిల్ మరి రవితేజతో కిషోర్ ఏదైనా లవ్ స్టోరీ ట్రై చేస్తున్నాడా అని మాస్ రాజా ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
రవితేజ ఎనర్జీకి కిషోర్ తిరుమల మార్క్ టేకింగ్ తోడైతే తప్పకుండా ఆడియన్స్ కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ షురూ అయినట్టే. ఐతే రవితేజ చేస్తున్న మాస్ జాతర కూడా ష్యూర్ షాట్ హిట్ టార్గెట్ తో వస్తుంది. సితార బ్యానర్ సినిమా కాబట్టి ఆ ప్రాజెక్ట్ మీద కూడా అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మరి ఈ సినిమాలతో మాస్ రాజా తన ఫ్యాన్స్ ని ఖుషి అయ్యేలా చేస్తాడా లేదా అన్నది చూడాలి.
రవితేజ సినిమా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్స్ అదిరిపోతాయి. ధమాకా తర్వాత రవితేజ సినిమా హిట్టు కోసం తపిస్తున్నాడు. మరి రాబోతున్న సినిమాలతో అయినా ఫ్యాన్స్ ఆకలి తీరుస్తాడేమో చూడాలి.