ఒళ్లంత తుళ్లింత రావాలిలే.. మలైకా స్కిన్నోవేషన్
ఈ కొత్త లుక్ యువతరాన్ని ఆకర్షిస్తోంది. ప్రఖ్యాత కార్పొరెట్ బ్రాండ్ ప్రచారం కోసం మలైకా కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. దీనికోసం కోటి పారితోషికం అందుకుంటోందని తెలుస్తోంది.;
ఒళ్లంత తుళ్లింత కావాలిలే.. గుండెల్లో జల్లంతా కురవాలిలే!! .. `గీతాంజలి`లో గిరిజ వాన పాట ఇది. ప్రస్తుతం మలైకా సన్నివేశం చూస్తుంటే ఇలానే ఉంది. అందమైన బాడీ ఫిట్ దుస్తుల్లో మలైకా కవ్వింత ఇప్పుడు చర్చగా మారింది. నిజానికి ఇలాంటి అవతారం ఇదే మొదటి సారి కాదు. ఈ కొత్త లుక్ యువతరాన్ని ఆకర్షిస్తోంది. ప్రఖ్యాత కార్పొరెట్ బ్రాండ్ ప్రచారం కోసం మలైకా కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. దీనికోసం కోటి పారితోషికం అందుకుంటోందని తెలుస్తోంది.
స్కిన్నోవేషన్ పేరుతో కొవ్వును కరిగించే పరికరాల సంస్థకు మలైకా ప్రచారం చేస్తోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో స్కిన్ టైట్ దుస్తులను ధరించి గుండెల్ని మరిగించింది. ప్రస్తుతం ఈ ప్రమోషనల్ కార్యక్రమం నుంచి మలైకా కొత్త లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. 50 వయసులోను మల్లా అందచందాలు యూత్ కి మతులు చెడగొడుతున్నాయి. అదే సమయంలో ఏజ్ లెస్ బ్యూటీగా మలైకా కోట్లాది రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను దక్కించుకోవడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.
వెల్ నెస్, ఫిట్ నెస్ రంగాల్లో ఉత్పత్తులకు ప్రచారం చేయడానికి మలైకా బెస్ట్ ఆప్షన్ అనడంలో సందేహం లేదు. నిరంతరం జిమ్ యోగాతో పర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో కనిపించే మలైకా ఇప్పుడు టోన్డ్ లుక్ కోసం యూత్ కి దిశా నిర్ధేశనం చేస్తోంది. అయితే ఇలాంటి కార్పొరెట్ ఉత్పత్తులతో రిజల్ట్ ఎలా ఉంటుందో చెక్ చేయకుండా ఎలాంటి ప్రచారం కల్పించినా దానిపై విమర్శలు వెల్లువెత్తడం ఖాయం. మలైకా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందని భావిద్దాం.
మలైకా ఫిట్‌నెస్ దినచర్యలో యోగా, పైలేట్స్, ఎనర్జీ శిక్షణ, నృత్యం ఉంటాయి. ఇవి టోన్డ్ బాడీని కొనసాగించేందుకు, యవ్వన శక్తిని కాపాడుకోవడానికి సహాయపడతాయి. సమతుల్య ఆహారం, హైడ్రేషన్, స్వీయ సంరక్షణ ప్రాముఖ్యతను మలైకా తన అభిమానుల కోసం చెబుతుంది.