అంబానీ 63 కోట్ల వాచ్‌ని చూసేందుకు ఎగబడ్డ FB అధినేత!
ముంబై వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌తో జూలైలో గ్రాండ్ వెడ్డింగ్‌కు సిద్ధమవుతున్నారు
అంబానీల పెళ్లిలో చిత్ర విచిత్రాలు మీడియా హెడ్ లైన్స్ లోకొస్తున్నాయి. మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలలో కాబోయే వరుడు అనంత్ అంబానీ 63 కోట్ల రూపాయల వాచ్ ని ధరించడంతో జనం దానిని చూసేందుకు ఎగబడ్డారు. ఎగబడిన సెలబ్రిటీల్లో ఏకంగా ఫేస్ బుక్ అధినాయకుడు ఆయన భార్య, బిల్ గేట్స్ అధినాయకుడు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
ముంబై వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌తో జూలైలో గ్రాండ్ వెడ్డింగ్‌కు సిద్ధమవుతున్నారు. అంబానీ కుటుంబం విలాసవంతమైన స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లలో తగ్గేదేలే అంటూ ప్రీవెడ్డింగ్ వేడుకలను నిర్వహిస్తోంది. అనంత్ అంబానీ వివాహానికి ముందు జరిగే నిరంతర వేడుకలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారతదేశపు అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ కుటుంబం విలాసవంతమైన పార్టీలతో సంచలనం సృష్టించడానికి అలవాటు పడింది. అనంత్ పెళ్లి కూడా దీనికి మినహాయింపు కాదు.
వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయనే చర్చలతో సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. అయితే ఇంత మంది పాల్గొన్న ఈ వేడుకల్లో ప్రజల దృష్టిని ఆకర్షించిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. కాక్‌టెయిల్ పార్టీలో రిహానా ప్రదర్శన కోసం భారతీయ రూపాయలలో దాదాపు 70 కోట్లు అందుకుంది. అయితే ఇంచుమించు అంతే ఖరీదు చేసే వాచ్ తో కాబోయే పెళ్లి కొడుకు ఈ ప్రీవెడ్డింగ్ వేడుకలో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి అంబానీ కుటుంబం విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉంది. తాజా ఈవెంట్ కోసం అనంత్ అంబానీ రూ. 63 కోట్ల ఖరీదు చేసే వాచ్ తో కనిపించాడు. ఈ వాచ్ పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్ స్కై మూన్ టూర్‌బిలియన్ బ్రాండ్.. ఇది ప్రపంచంలోనే రిచెస్ట్ పీపుల్ ధరించే లగ్జరీ బ్రాండ్ గా పాపులరైంది. అందుకే ఈ వాచ్ ని వీక్షించేందుకు బిల్ గేట్స్.. మార్క్ జుకర్ బర్గ్ వైఫ్ సహా పలువరు ఎంతో ఆసక్తిని కనబరిచారు.
ఈ ఖరీదైన గడియారం డిజైన్ ప్రరత్యేకత ఏమిటి? అంటే.. నిజానికి ఈ వాచ్ ఎంతో యూనిక్ నెస్ తో ఆకర్షిస్తోంది. బాక్స్‌లు, కుంభాకార చెవి ఆకృతులు, స్లైడ్‌లు, కిరీటాలతో చేతితో డిజైన్ చేసిన గులాబీ-ఉన్ని కేస్‌ను ఇది కలిగి ఉంది. వ్యాసం 44 మిమీ .. ఎత్తు 17.35 మిమీ. బంగారు రోమన్ సంఖ్యలతో బ్రౌన్ ఎనామెల్ డయల్ ప్రధాన ఆకర్షణ. ఇది గ్రాండ్ ఫ్యూ ఎనామెల్ అండ్ క్లోయిసోనేతో తయారు చేసినది.
గడియారం సగటు సౌర గంటలు నిమిషాలు, రెట్రోగ్రేడ్ తేదీ సూచిక, వారంలోని రోజు, నెల, చంద్ర దశ , లీపు సంవత్సరం చక్రం సహా అనేక రకాల అంశాలను వాచ్ లో చూడొచ్చు. కాలిబర్ R TO 27 QR SID LU CL కాంప్లెక్స్ కదలిక ఒక నిమిషం రిపీటర్, టూర్ బిల్లన్, శాశ్వత క్యాలెండర్, సైడ్‌రియల్ టైమ్, ఖగోళ మ్యాప్ కూడా ఇందులో వీక్షించవచ్చు. వాచ్‌లో చెస్ట్‌నట్-పెయింటెడ్ ఎలిగేటర్ లెదర్ స్ట్రాప్ ఉన్నాయి. కల్ ట్రవా క్రాస్-అలంకరించిన కఫ్‌లింక్‌లు ఈ అసాధారణ టైమ్‌పీస్‌ని అందంగా మార్చాయి.
జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్‌లో మూడు రోజుల పాటు జరిగే ప్రీవెడ్డింగ్ వేడుకలో తారల కోలాహలం సందడి హైలైట్ గా నిలిచింది. ఈ కార్యక్రమానికి రిహన్నా, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, మెట్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అతని భార్య ప్రిస్సిల్లా చాన్, బిల్ గేట్స్ తదితరులు హాజరయ్యారు.