అంబానీ నికర విలువలో పెళ్లి ఖర్చు 0.5%!
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం నేడు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం నేడు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల వివాహానికి అతిరధ మహారధులంతా హాజరవు తున్నారు. అతిధులంతా తప్పకుండా డ్రెస్ కూడా పాటించాలనే నిబంధన ఉంది. దాని ప్రకారం అంతా నడుచుకుంటున్నారు. ప్రస్తుతం కన్వెన్షన్ సెంటర్ లోపల, ప్రాంగణమంతా కోలాహాలంగా ఉంది.
ప్రాంగణం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసారు. ప్రేక్షకాభిమానుల తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన వారంతా వివాహ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. మరి ఈ వివాహం కోసం అంబానీ ఎలాంటి వంటకాలు చేయిస్తున్నారో తెలిసిందే. ప్రీవెడ్డింగ్ వేడుకల కోసమే 2000 వేల రకాలుగా పైగా వంటకాలు చేయించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు అంతకు మించి వంటకాల ఘుమఘుమలు ఘుభాళిస్తుంటాయి.
ఇక సాయంత్రం అయ్యేసరికి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన లైటింగ్ నడుమ ముంబై వెలిగిపోతుంది. కొన్ని రోజులగా ఇదే తంతు కనిపిస్తుంది. మరి ఈ వివాహం కోసం అంబానీ ఎంత ఖర్చు చేస్తున్నారు? అంటే అక్షరాలా 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పోర్స్బ్ అంచనా వేసింది. ఇది అంబానీ నికర విలువలో 0.5 శాతం మాత్రమే. అంటే ఐదువేల కోట్లు అంబానీకి జూజూబీ అన్నట్లే. ఇక కుటంబ సభ్యులంతా ఎలా అలంకరించుకున్నారో కనిపిస్తూనే ఉంది.
వందల కోట్ల ఖరీదుగల బంగారు ఆభరణాలు ధరిస్తున్నారు. బంగారం చీరలు ధరిస్తున్నారు. నుదిటిన పాపిడి బొట్టు నుంచి కాలికి తొడిగే మెట్టు వరకూ ప్రతీది బంగారమే. అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా బంగారంతోనే దుస్తులు తయారు చేయించిన సంగతి తెలిసిందే. అంబానీ కూతురు, అల్లుడు, పెద్ద కొడుకు, కోడలు అంతా కలిసి పెళ్లిని వారం రోజులుగా ఆస్వాదిస్తూనే ఉన్నారు. మరో మూడు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి.