అతనే నా క్రష్ అంటున్న హీరోయిన్..!

ఈ క్రమంలో తన క్రష్ తో పాటుగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో అన్న విషయాన్ని కూడా చెప్పింది. యువ హీరో నాగ శౌర్య మీద తనకు కష్ ఉందని ఓపెన్ గా చెప్పేసింది అనన్యా నాగళ్ల.

Update: 2024-03-08 03:00 GMT

మల్లేశం సినిమాతో మెప్పించిన అనన్యా నాగళ్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో కూడా ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాతో సూపర్ పాపులర్ అయిన అనన్యా ఓ పక్క సోలో ప్రయత్నాలు చేస్తూనే స్టార్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తుంది. లేటెస్ట్ గా అనన్యా నాగళ్ల ఒక క్రేజీ అటెంప్ట్ తో వస్తుంది. శ్రీనివాస్ గోపిశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన తంత్ర సినిమాతో ఆడియన్స్ కు హార్రర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు వస్తుంది అమ్మడు.

ధనుష్ రఘుముద్రి లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో అనన్యా నాగళ్ల ఫిమేల్ లీడ్ గా నటించింది. ఈ నెల 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అనన్యా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ క్రమంలో తన క్రష్ తో పాటుగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో అన్న విషయాన్ని కూడా చెప్పింది. యువ హీరో నాగ శౌర్య మీద తనకు క్రష్ ఉందని ఓపెన్ గా చెప్పేసింది అనన్యా నాగళ్ల. మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఇష్టమే అని.. వారి సినిమాలు చూస్తూ పెరిగాను అయితే నాగ శౌర్య అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది అనన్యా నాగళ్ల.

ఇక తనకు ఇంతవరకు ఎవరు ప్రపోజ్ చేయలేదని తనకు ఇష్టమైన వాడు ఇంకా తారసపడలేదని.. మంచి మనసున్న వ్యక్తి తనకు తోడుగా కావాలని. ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది అనన్యా. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు నటించాలని అంటుంటారు. ఆ దారిలోనే అనన్యా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

సినిమాలతో సంబంధం లేకుండా అనన్యా ఫోటో షూట్స్ తో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఆమె షేర్ చేసే ఫోటో షూట్స్ కి మంచి పాపులారిటీ వస్తుంది. అనన్యా నాగళ్ల ఫోటో షూట్ వస్తే చాలు క్షణాల్లో అది వైరల్ గా మారుతుంది. సినిమాలతో పాటు ఫోటో షూట్స్ తో కూడా అలరించాలని చూస్తున్న అనన్యా నాగళ్ల కెరీర్ లో ఇంకాస్త దూసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. మరి అమ్మడి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News