డైరెక్టర్ తప్పుడు ఆరోపణలు చేశాడంటున్న హీరోయిన్
ఓటీటీ ద్వారా బాగా ఫేమస్ అయిన మలయాళ నటి అనస్వర రాజన్. 15వ ఏటనే ఇండస్ట్రీకి వచ్చిన అనస్వర తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.;
ఓటీటీ ద్వారా బాగా ఫేమస్ అయిన మలయాళ నటి అనస్వర రాజన్. 15వ ఏటనే ఇండస్ట్రీకి వచ్చిన అనస్వర తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి సీనియర్ నటులతో నటించిన అనస్వర తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అమ్మడు నటించిన మిస్టర్ & మిసెస్ బ్యాచిలర్ సినిమా ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది.
ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర డైరెక్టర్ దీపు కరుణకారన్ అనస్వరపై చేసిన ఆరోపణలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అసలు విషయానికొస్తే ఇంద్రజిత్ సుకుమారన్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా మిస్టర్ & మిసెస్ బ్యాచిలర్ అనే మూవీ చేశారు. ఈ సినిమా వాస్తవానికి గతేడాది ఆగస్టులోనే రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది.
అయితే కొన్నాళ్ల కిందట ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న డైరెక్టర్ దీపు కరుణాకరన్, తమ సినిమా హీరోయిన్ అనస్వర రాజన్ ప్రమోషన్స్ కు అసలు సహకరించట్లేదని చెప్పడంతో దానిపై అనస్వర రెస్పాండ్ అయింది. డైరెక్టర్ అన్నీ అబద్ధాలే చెప్తున్నాడని, ఈ సినిమా కోసం ఇచ్చిన ఒకే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ తనదేనని, తన సోషల్ మీడియాలో కూడా సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ చేశానని తెలిపింది.
అంతేకాదు ఆగస్టు లో రిలీజ్ అవాల్సిన సినిమా డేట్ మారుతున్న విషయం కూడా తనకు చెప్పలేదని, తనకు సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి ఆరోపణలు చేసి తన పరువు తీయాలని ట్రై చేస్తే తాను ఎంతదూరమైనా వెళ్తానని ఆమె హెచ్చరింది.
ఇప్పటికే డైరెక్టర్ దీపు కరుణాకరన్‌పై అనస్వర రాజన్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిరాద్యు చేయగా, ప్రస్తుతం ఈ గొడవ మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే అనస్వర రాజన్ నటించిన హిట్ సినిమా రేఖా చిత్రం ఈ శుక్రవారం నుంచి ఓటీటీలోకి రానుంది.