'స్పిరిట్' లో చాన్స్ అడిగిన అనీల్ రావిపూడి!
పూర్తి స్థాయిలో నటుడిగా మారే ఆలోచన లేదు కానీ అవకాశం వస్తే ప్రభాస్ తో మాత్రం తెరను పంచుకోవాలని ఉందనే ఆసక్తిని వెల్లడించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రోడక్షన్ పనుల్లో ఉంది. దీనిలో భాగంగా సందీప్ నటీనటుల ఎంపిక పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం నాకు ఇవ్వండి అంటూ దర్శకుడు అనీల్ రావిపూడి సందీప్ ని అడిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అనీల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు.
పూర్తి స్థాయిలో నటుడిగా మారే ఆలోచన లేదు కానీ అవకాశం వస్తే ప్రభాస్ తో మాత్రం తెరను పంచుకోవాలని ఉందనే ఆసక్తిని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అనిల్ ని కలిసి `స్పిరిట్` లో ఛాన్స్ అడిగినట్లు తెలిపాడు. మరి ఆ ఛాన్స్ సందీప్ ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి. అనీల్ అడిగింది విలన్ పాత్రో....భారీ లెంగ్త్ ఉండే పాత్ర కాదులే. ప్రభాస్ తో రెండు..మూడు సన్నివేశాల్లో ఉండే చిన్న సీన్ అయి ఉంటుంది.
మరి సందీప్ ఆ ఛాన్స్ ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి. సందీప్ రెడ్డి సినిమాలంటే అనీల్ కి ఎంతో ఇష్టం. అతడిలా సినిమాలు చేయలేను కానీ ఆ తరహా సినిమాలంటే చాలా ఇష్టమని అనిల్ గతంలోనే తెలిపాడు. సందీప్ రెడ్డి లా ఉండాలని...అతడిని అనుకరించాలని ఉందని అన్నాడు. సినిమాలు తీయడంలో ఎవరి సరళి వారికి ఉంటుందని...నేను సందీప్ లా తీయలేను.. సందీప్ నాలా కామెడీ సినిమాలు తీయలేడు.
ఇండస్ట్రీలో ఎవరి స్టైల్ వారికుంటుందని చెప్పుకొచ్చాడు. అయితే కామెడీ సినిమాలంటే ప్రభాస్ కి చాలా ఇష్టం. అందుకే మారుతి దర్శకత్వంలో `రాజాసాబ్` సినిమా చేస్తున్నాడు. అది పాన్ ఇండియా రేంజ్ సినిమా కాదు. కామెడీ థ్రిల్లర్ జానర్ చిత్రం. డార్లింగ్ కోసం అనీల్ మంచి కామెడీ స్క్రిప్ట్ రాయాలే గానీ ప్రభాస్ నో చెప్పకుండా చేస్తారు. భారీ యాక్షన్ సినిమాల మధ్యలో ఇలాంటి కామెడీ ప్రయత్నాలు డార్లింగ్ కి ఇష్టమే.