జావెద్ విమర్శపై యానిమల్ కౌంటర్!
ఇటీవలే ప్రముఖ సీని రచయిత జావెద్ అక్తర్ కూడా మండిపడిన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియాలో రిలీజ్ అయిన `యానిమల్` ఎంత పెద్ద విజయం సాధించిందో? అంతకంతకు విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ లాంటి వారు యానిమల్ ని ఆకాశానికి ఎత్తేసినా! కొందరు ప్రముఖులు మాత్రం స్త్రీలను చిన్న చూపు చేసేలా ఉందని విమర్శించారు. ఈసినిమాపై పార్లమెంట్ లో కూడా చర్చ జరిగిందంటే? ఎంతటి సంచలనమైందో చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు ప్రమాదకరమని సభ్యుల అభిప్రాయపడ్డారు.
ఇటీవలే ప్రముఖ సీని రచయిత జావెద్ అక్తర్ కూడా మండిపడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని హిట్ చేసిన ప్రేక్షకుల్ని తప్పుబట్టారు. పురుషుడు ఒక మహిళని తన షూ నాకాలనడం.. అలా చేస్తేనే హీరో తన ప్రేమ ఉందని భావిస్తాడు. అదే సమయంలో మహిళలను చెంప మీద కొట్టడం కరెక్టే అని చెప్తారు. మరో సందర్భంలో మహిళపై బూతులతో విరుచుకు పడతాడు. ఇలాంటి సన్నివేశాలు ఉన్న ఆ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.
ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జావెద్ విమర్శలపై యానిమల్ టీమ్ స్పందించింది. `జోయా- రణబీర్ మధ్య జరిగిన ద్రోహాన్ని రచయిత అర్థం చేసుకోవాలి. లేదంటే మీ కళ అంతా ఒక పెద్ద అబద్ధం. ఒక మహిళను ప్రేమ పేరుతో ఒక వ్యక్తి మోసం చేస్తే నా షూ నాకండి అన్నా ఫర్వాలేదు.
కానీ స్త్రీని అలా అంటే మీ దృష్టిలో తప్పా? లింగ బేధమనే పాలిటిక్స్ లో ప్రేమకు విముక్తి కల్పించండి. అప్పడే వారిని ప్రేమికులు అంటారు. ప్రియురాలు మోసం చేసింది. అతడికి అబద్దం చెప్పింది. అందుకే ప్రియుడు తన షూ నాకమన్నాడు` అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. మరి టీమ్ తాజా ట్వీట్ పై జావెద్ అక్తర్ మళ్లీ స్పందిస్తారా? సైలెంట్ గా ఉంటారా? అన్నది చూడాలి.