జావేద్ అక్తర్‌కు యానిమల్ టీమ్ కౌంటర్
ఆదివారం, యానిమల్ బృందం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో జావేద్ అక్తర్‌ను నిందించింది.
రణబీర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సిసలైన పాన్ ఇండియా హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రూ.899 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అఖండ విజయాన్ని చిత్రబృందం సెలబ్రేట్ చేస్కుంటోంది. చాలా విమర్శలు వచ్చినా కానీ, వాటితో వచ్చిన ప్రచారాన్ని యానిమల్ ఎన్ క్యాష్ చేసుకుంది. థియేట్రికల్ కలెక్షన్లు ఎక్కడా తగ్గలేదు.
నిజానికి యానిమల్ చిత్రం విడుదలైనప్పటి నుండి స్త్రీద్వేషపూరిత టోన్ .. హింసాత్మక సన్నివేశాలు రక్తపాతం అత్యాచార సన్నివేశాలు విమర్శలకు గురయ్యాయి. ఇటీవల బాలీవుడ్ సీనియర్ లిరిసిస్ట్ కం రైటర్ జావేద్ అక్తర్ ఓ పబ్లిక్ ఈవెంట్లో ఈ చిత్రాన్ని విమర్శించారు. ఈ విజయం ప్రమాదకరమైనది అని పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రిప్తి దిమ్రి షూ లికింగ్ సీన్ పై తీవ్రంగా విమర్శించారు జావేద్. దీనిపై స్పందించిన చిత్ర బృందం అతడికి కౌంటర్ వేసింది. అయితే వారి సమాధానం నెటిజనులకు ఆగ్రహం తెప్పించింది.
ఆదివారం, యానిమల్ బృందం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో జావేద్ అక్తర్‌ను నిందించింది. అంత పెద్ద కాలిబర్ ఉన్న రచయిత ప్రేమికుడికి చేసిన ద్రోహాన్ని అర్థం చేసుకోలేకపోతే మీ కళారూపాలన్నీ పెద్ద అబద్ధం! అని ప్రతి కౌంటర్ వేసారు. స్త్రీవాదంపై ఆయన కామెంట్లను నిరసించింది యానిమల్ టీమ్.
ప్రేయసి (జోయా - రణవిజయ్ మధ్య) చేసిన ద్రోహాన్ని మీలోని క్యాలిబర్ రచయిత అర్థం చేసుకోలేదు! అప్పుడు మీ కళారూపాలన్నీ పెద్ద అబద్ధం అంటూ తలకిందులుగా ఉన్న ముఖం ఎమోజిని షేర్ చేసారు. ప్రేమను, ప్రేమికుల్ని ఇలాంటి లింగ రాజకీయాల నుండి విముక్తి పొందనివ్వండి. వారిని ప్రేమికులు అని పిలుద్దాం. ప్రేమికుడిని ఆమె మోసం చేసింది... అబద్దాలు చెప్పింది. ప్రేమికుడు `నా షూ *కు` అని సీరియస్ గా అన్నాడు. దీనిని మీరు అర్థం చేసుకోలేదు! అని కౌంటర్ వేసారు.
యానిమల్ టీమ్ స్పందనపై నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోతూ మేకర్స్‌పై విరుచుకుపడ్డారు. మీరు సమస్యాత్మకమైన సినిమా చేసారనేది మీకు తెలుసా !! అని కొందరు వ్యాఖ్యానించగా, జావేద్ అక్తర్ సాబ్‌తో సందీప్ వంగా ఇలా చెబుతాడా?. మూడు సినిమాలు తీసి అహంకారిగా మారాడు! సందీప్ వంగాలో మితిమీరిన గర్వం పెరిగింది. ఈ సమయం వారందరికీ అనుకూలంగా ఉంది.. మంచి సమయాల్లో ప్రజలు మీకు అండగా ఉంటారు.. చెడు సమయాలు వస్తాయి... మీతో ఉన్న వారే మిమ్మల్ని ట్రోల్ చేస్తారు..! అని మరొకరు సీరియస్ అయ్యారు. అతడు జావేద్ అక్తర్‌కి కళ గురించి నేర్పిస్తున్నాడు... ఎంత వ్యంగ్యం. బాలీవుడ్ /సలీం-జావేద్ అందించిన టెంప్లేట్ కారణంగా సౌత్‌వుడ్ ఉనికిలో ఉందని మరువొద్దు అని ఒకరు వ్యాఖ్యానించారు.
ఇటీవల జావేద్ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF)కి హాజరై, యానిమల్ విజయాన్ని విమర్శించారు. ఒక సినిమాలో ఒక పురుషుడు స్త్రీని తన షూ లిక్ చేయమని చెప్పి, అమ్మాయిని చెంపదెబ్బ కొట్టడం చాలా ప్రమాదకరం. ఇది బాక్సాఫీస్ వద్ద పని చేస్తుంది కానీ సరికాదు! అని అన్నారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్‌లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, సిద్ధాంత్ కర్నిక్, బాబీ డియోల్, ట్రిప్తి డిమ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం స్త్రీద్వేషపూరిత హింసాత్మక కంటెంట్‌తో తెరకెక్కిందని సమాజంలోని ఒక వర్గం విమర్శించినప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత స్పందనతో దూసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 898.65 కోట్లు వసూలు చేసింది.