శ్రీదేవి కూతురు కంటే బోనీ కూతురు బ్యూటిఫుల్
అన్షులా తన సోదరీమణుల తరహాలో నిరంతరం హంగామా క్రియేట్ చేయదు. ఫోటోగ్రాఫర్ల లెన్స్ లో పడి లైమ్ లైట్ లో ఉండదు.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్- ఖుషీ కపూర్ పరిచయం అవసరం లేదు. ఈ ఇద్దరు భామలు ఇంకా కథానాయికలు కాని రోజుల్లోనే గొప్ప ఫాలోయింగ్ ని సంపాదించారు. జాన్వీ నటిగా కెరీర్ ప్రారంభించి చాలా ఎత్తులకు ఎదిగింది. ఇప్పుడు ది ఆర్చీస్ తో ఖుషీ కపూర్ కూడా నటిగా రంగ ప్రవేశం చేస్తోంది. అయితే ఈ ఇద్దరి కెరీర్ ని ది బెస్ట్ గా తీర్చిదిద్దుతూ పాపా బోనీ కపూర్ తెలివైన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. కోట్లాది రూపాయల్ని కూతుళ్లే సంపాదిస్తుంటే బోనీ చిద్విలాసం చూడతరమా?
అదంతా సరే కానీ బోనీతో శ్రీదేవి వారసురాళ్లు జాన్వీ-ఖుషీ అందంగా ఉన్నారా? లేదూ బోనీకపూర్ కి అతడి మాజీ భార్యకు జన్మించిన అన్షులా కపూర్ అందంగా ఉందా? అంటూ ఇప్పుడు ఆన్ లైన్ లో ఊహించని ఒక డిబేట్ నడుస్తోంది. అయితే దానికి కారణం తాజాగా రివీలైన అన్షులా కపూర్ స్టన్నింగ్ వీడియో. ఈ వీడియోలో ఫోటోల్లోను అన్షులా ఎంతో అందంగా కనిపిస్తోంది. నిజానికి జాన్వీ-ఖుషీ నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ అల్ట్రా స్లిమ్ లుక్ తో కనిపిస్తారు. కానీ దానికి విరుద్ధంగా అన్షులా ఎంతో బొద్దుగా కనిపిస్తోంది. కానీ తన ముఖంలో ఏదో ప్రత్యేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని నెటిజనులు విశ్లేషిస్తున్నారు. నిజానికి జాన్వీ, ఖుషీ స్టన్నింగ్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్నా ఆ ఇద్దరిలో ఏదో మిస్సయిందని అనుమానం ఎప్పటికీ అలా ఉండిపోయింది. శ్రీదేవిని చూసిన కళ్లతో ఆ ఇద్దరినీ అభిమానులు చూడలేకపోయారు.
కానీ ఇప్పుడు శ్రీదేవి కూతుళ్లు అందంగా ఉన్నారా? లేదూ బోనీ మాజీ భార్య కూతురు అందంగా ఉందా? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. అన్షులా తన సోదరీమణుల తరహాలో నిరంతరం హంగామా క్రియేట్ చేయదు. ఫోటోగ్రాఫర్ల లెన్స్ లో పడి లైమ్ లైట్ లో ఉండదు. కానీ ఇటీవల తన రూపాన్ని మార్చుకుని అనూహ్యమైన లుక్ తో కనిపిస్తోంది. అన్షులా బొద్దుతనం తగ్గించుకుని చాలా వరకూ స్లిమ్ అయింది. మునుముందు ఈ బ్యూటీ తన హార్డ్ వర్క్ తో అల్ట్రా స్లిమ్ గా కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషిస్తున్నారు. కొందరైతే ఈ అనూహ్య మార్పు చూశాక .. తను కూడా హీరోయిన్ అవుతుందని ఊహిస్తున్నారు. అయితే ఈ ఊహాగానాల్ని నిజం చేస్తూ బోనీ షాక్ ఇచ్చినా ఇవ్వొచ్చనేది కొందరి భావన. దీనికి కాలమే సమాధానం ఇవ్వాల్సి ఉంది.
అన్షులా వెనక అంత కథ ఉంది: బాలీవుడ్‌లోని అతి పెద్ద కుటుంబం నుండి .. కజిన్స్ సూపర్‌స్టార్ లుగా ఉన్న చోట.. బోనీ కుమార్తె, అర్జున్ కపూర్ సోదరి అన్షులా తన సొంత గుర్తింపు కోసం పాకులాడుతుండడం ఆసక్తికరం. ఈ భామ వేదికలపై ఫిల్టర్ చేయని అభిప్రాయాల తో ఆకర్షిస్తుంది కూడా. అన్షులా మొహమాటం అన్నదే లేకుండా తన ఆలోచనలు భావాలను ప్రపంచంతో షేర్ చేసుకుంది. తాను ఎలా కనిపిస్తుందో .. తాను ఎవరో.. జీవితంలో దుఃఖంతో పోరాడుతున్న రోజులు ఎలాంటివో.. అన్షులా వీలైనంత నిజాయితీగా మాట్లాడింది.
ఈ నెల ప్రారంభంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అన్షులాతో సంభాషించే అవకాశం హెల్త్ మీడియాలకు లభించింది. మానసిక ఆరోగ్య అవగాహనను పెంపొందించడానికి లెట్స్ బి బ్రేవ్ టుగెదర్ అనే ప్యానెల్ చర్చలో అన్షులా భాగమైంది. ఆమె ఎవరో తెలియని వ్యక్తి నుండి, ఇప్పుడు శరీర సానుకూలత .. మానసిక ఆరోగ్య అవగాహన కోసం నిలబడే వ్యక్తి గా మారడం వరకు అన్షులా తన స్ఫూర్తిదాయకమైన స్వీయ-ఆవిష్కరణ ప్రయాణాన్ని రివీల్ చేసింది.
2012లో అన్షులా కపూర్ తన తల్లిని క్యాన్సర్ వల్ల కోల్పోయింది. ఇది తన మనసుపై చెరగని ప్రభావాన్ని మిగిల్చిన సంఘటన. అన్షులా 14 సంవత్సరాల వయస్సు నుండి PCOS తో బాధపడింది. అయినప్పటికీ ఇటీవలి కంబ్యాక్ స్ఫూర్తివంతం. ఫిట్నెస్ లో తన పరివర్తన, శరీర సానుకూలత, స్వీయ సంరక్షణ.. గురించి వేదికపై మాట్లాడింది. అన్షులా ఆన్లైన్ సెలబ్రిటీ ఫండ్రైజర్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్యాన్‌కైండ్ అనే తన ఛారిటీ ఫౌండేషన్‌ను కూడా నడుపుతోంది. ప్రతిసారీ మంచి మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంది.