సూపర్ స్టార్ కిడ్‌ కి జోడీగా టిల్లు 2 లవర్‌

మలయాళ ప్రేమమ్‌ సినిమా తో సౌత్‌ లో మోస్ట్‌ పాపులర్ నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌.

Update: 2024-03-12 08:56 GMT

మలయాళ ప్రేమమ్‌ సినిమా తో సౌత్‌ లో మోస్ట్‌ పాపులర్ నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ మరియు మలయాళ భాషా చిత్రాల్లో కూడా వరుసగా నటిస్తోంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డకు జోడీగా టిల్లు స్క్వేర్‌ (డీజే టిల్లు 2) సినిమాలో నటించింది.


టిల్లు స్క్వేర్‌ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో తెలుగు సినిమాలో కూడా అనుపమ నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే సమయంలో తమిళంలో మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక ప్రతిష్టాత్మక సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్‌ గా ఎంపిక అయ్యింది.

తమిళ సూపర్‌ స్టార్‌ విక్రమ్‌ వారసుడు ధృవ్‌ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ ఎంపిక అయ్యింది. ఈ విషయం అధికారికంగా కన్ఫర్మ్‌ అయ్యింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోను షేర్‌ చేశారు.

ఒక వైపు పెద్ద హీరోలతో నటిస్తూ మరో వైపు చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు తక్కువ కాకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అనుపమ తాజాగా ధృవ్‌ తో నటించేందుకు ఎంపిక అయిన నేపథ్యంలో కచ్చితంగా తమిళనాట మరింత బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News