అనుష్క బ్లడ్ స్టోరీకి గుమ్మడి కాయ..!
మొత్తానికి అనుష్క ఘాటీ సినిమా గత కొన్ని రోజులుగా వార్తల్లో కొనసాగుతూనే ఉంది.
స్టార్ హీరోయిన్ అనుష్క సుదీర్ఘ విరామం తర్వాత క్రిష్ దర్శకత్వంలో 'ఘాటీ' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల వచ్చిన టీజర్‌లో అనుష్కను మరీ వైల్డ్‌గా చూపించడంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఘాటీ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. చాలా మంది లేడీ యానిమల్ మాదిరిగా అనుష్క ఉందని కామెంట్స్ చేస్తే బాబోయ్ మరీ ఇంత బ్లడ్ స్టోరీ ఏంట్రా బాబు అంటూ కొందరు అవాక్కయ్యారు. మొత్తానికి అనుష్క ఘాటీ సినిమా గత కొన్ని రోజులుగా వార్తల్లో కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా గురించి కొత్త వార్త ఒకటి మీడియా వర్గాల ద్వారా వచ్చింది.
దర్శకుడు క్రిష్ 'ఘాటీ' సినిమాను 2025 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. అందుకు గాను సినిమా షూటింగ్‌ను డిసెంబర్‌లో పూర్తి చేయాలని భావించారు. కానీ ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తోంది. అనుకున్న దాని కంటే వారం రోజుల ముందుగానే ఘాటీ సినిమాకు గుమ్మడి కాయ కొట్టేశారట. తాజాగా సినిమా షూటింగ్ పూర్తి కావడంతో గుమ్మడి కాయ కొట్టినట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. షూటింగ్ ముగించిన దర్శకుడు క్రిష్ రాబోయే రెండు మూడు నెలలు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాను వదిలేసి మరీ క్రిష్ ఈ సినిమాను చేశాడు అంటే ఆయనకు ఈ సినిమాపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అనుష్కతో ఆయన చేసిన వేదం సినిమాకు ఏ స్థాయి ప్రశంసలు దక్కాయి అనేది తెల్సిందే. ఇప్పుడు ఘాటీ సినిమాకు సైతం అదే స్థాయిలో మంచి స్పందన వస్తుంది అనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఘాటీ సినిమాలో అనుష్క మాస్ లుక్, వైల్డ్ యాక్టింగ్కి ఆమె ఫ్యాన్స్‌తో పాటు అందరు హీరోల ఫ్యాన్స్ ఫిదా కావడం ఖాయం అని, ఘాటీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ నెటిజన్లు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో మాత్రమే కాకుండా కన్నడం, మలయాళం, తమిళ్, హిందీలోనూ ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. బాహుబలి స్టార్ కావడంతో అనుష్క సినిమా అనగానే అన్ని భాషల్లోనూ అంచనాలు ఉన్నాయి. పైగా అనుష్క గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచినా అన్ని భాషల్లోనూ విడుదల కాబడ్డాయి. కనుక ఈ సినిమా సైతం అన్ని భాషల్లో విడుదల కావడం ఖాయం. అన్ని భాషల ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది అనే విశ్వాసంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా నుంచి స్పెషల్ గ్లిమ్స్‌ను త్వరలో విడుదల చేస్తారేమో చూడాలి.