పెళ్లి గురించి ఓపెనైన మ‌లైకా మాజీ అర్జున్

మలైకా అరోరా- అర్జున్ క‌పూర్ జంట ప్రేమాయ‌ణం, బ్రేక‌ప్ గురించి కొంత‌కాలంగా మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.

Update: 2025-02-03 03:54 GMT

మలైకా అరోరా- అర్జున్ క‌పూర్ జంట ప్రేమాయ‌ణం, బ్రేక‌ప్ గురించి కొంత‌కాలంగా మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. బ్రేక‌ప్ మ్యాట‌ర్ అంద‌రికీ తెలిసిన విష‌యం. ప్ర‌స్తుతం తాను సింగిల్‌గా ఉన్నాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించిన అర్జున్, ప్రియురాలు మ‌లైకా నుంచి విడిపోయిన కొన్ని నెలల తర్వాత తన వివాహ ప్రణాళిక గురించి వెల్లడించాడు.

త‌న సినిమా 'మేరే హస్బెండ్ కి బివి' రిలీజ్ ప్ర‌చారంలో అర్జున్ ఓపెన‌య్యాడు. ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో అత‌డు త‌న రియ‌ల్ లైఫ్ పెళ్లి ఆలోచ‌న గురించి వెల్ల‌డించాడు. ''పెళ్లి అనేది ఎప్పుడు జరుగుతుందో మీ అందరికీ తెలియజేస్తాను. ఈరోజు సినిమా గురించి మాత్ర‌మే మాట్లాడుతాను'' అని అన్నాడు. నేను సుఖంగా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి ముచ్చ‌టించుకుందాం. ప్ర‌స్తుతం సినిమా గురించి మాత్ర‌మే సెల‌బ్రేట్ చేయాలి! అని అర్జున్ అన్నారు.

సమయం వచ్చినప్పుడు పెళ్లి గురించి మీతో చెబుతాను! అని మాత్ర‌మే అర్జున్ వ్యాఖ్యానించాడు. కొద్దిరోజుల‌ క్రితం, అర్జున్ తాను మలైకా అరోరా నుంచి విడిపోయినట్లు ప్రకటించాక‌ వార్తల్లో నిలిచాడు. రాజ్ థాకరే నిర్వహించిన దీపావళి పార్టీలో తాను ఇప్పుడు ఒంటరిగా ఉన్నానని వెల్లడించాడు. అది జాతీయ స్థాయిలో చ‌ర్చ‌గా మారింది.

`మేరే హస్బెండ్ కి బివి` పోస్ట‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. నారీ నారీ నడుమ న‌లిగిపోతున్న అమాయక పిల్లాడిగా అర్జున్ ఈ పోస్ట‌ర్ల‌లో క‌నిపిస్తున్నాడు. ఇవ‌న్నీ వైర‌ల్ గా దూసుకెళ్లాయి. అర్జున్ , భూమి ఫెడ్నేక‌ర్, రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం థియేట‌ర్ల‌లో 21 ఫిబ్రవరి 2025న విడుద‌ల కానుంది. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శక్తి కపూర్, అనితా రాజ్, డినో మోరియా, ఆదిత్య సీల్ సహాయక పాత్రల్లో నటించారు.

Tags:    

Similar News