500.. 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం గొప్ప నిర్ణయమే. కానీ దాని వల్ల తాత్కాలికంగా సామాన్య జనం చాలా ఇబ్బందులే పడుతున్నారు. ఇవాళ బ్యాంకులు.. ఏటీఎంలు మూతపడిపోవడంతో జనాలకు దిక్కు తోచడం లేదు. 500.. 1000 నోట్లు ఎవరిచ్చినా తీసుకోవట్లేదు. పెట్రోల్ బంకులు.. ఆసుపత్రుల్లో వీటిని అనుమతించాలని ప్రభుత్వం పేర్కొన్నా.. అక్కడ చిల్లరగా ఇవ్వడానికి వంద నోట్లు లేవు. మరోవైపు లీగల్ గా వ్యాపారాలు చేసేవాళ్లందరికీ ఇబ్బందులేమీ లేవని.. 500.. 1000 నోట్లను తీసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా ఈ నోట్లను అనుమతించట్లేదు. తర్వాత నోట్లను మార్చుకోవడం తలనొప్పిగా భావించి.. ఎక్కడా వీటిని అంగీకరించట్లేదు.
మరోవైపు సినిమా వాళ్లకు కూడా మోడీ నిర్ణయం పెద్ద షాక్ లాగే ఉంది. ఇవాళ ఉదయం నుంచి థియేటర్లలో 500.. 1000 నోట్లను అంగీకరించట్లేదు. వందలు అడుగుతున్నారు.. తప్ప కౌఃంటర్లలో పెద్ద నోట్లను అస్సలు అనుమతించట్లేదు. చిల్లర ఇస్తేనే సినిమా చూస్తా అంటున్నా.. ఒప్పుకోవట్లేదు. తిరిగి ఇవ్వడానికి వాళ్ల దగ్గర మాత్రం చిల్లర ఎక్కడుంది. చేతిలో ఉన్నవే తక్కువ వంద నోట్లు కావడంతో వాటిని సినిమా కోసం ఖర్చు పెట్టేస్తే వేరే అవసరాలకు ఎలా అన్నట్లు జనాలు.. సినిమా థియేటర్లకు వెళ్లడం మానేస్తున్నారు. దీంతో సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడుతోంది. ఈ శుక్రవారం నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియట్లేదు. పరిస్థితి మారకుంటే కొత్త సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడటం ఖాయం. మరోవైపు సినిమా విడుదలకు ముందు నిర్మాతలు.. బయ్యర్లు.. ఎగ్జిబిటర్ల మధ్య లావాదేవీలన్నీ పెద్ద నోట్లతోనే జరగాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా వాళ్లకు పెద్ద ఇబ్బందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/