యావత్ భారతదేశమే కాదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా విస్తుపోయేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న 500 -1000 నోట్ల బ్యాన్ ని ప్రకటించిన సంగతి తెలిసినదే. దేశంలో కోటాను కోట్లుగా దాగున్న నల్లధనాన్ని అరికట్టడానికి ప్రధాని తీసుకున్న బోల్డ్ డెసిషన్స్ లో ఇదీ ఒకటి. దాదాపు భారతదేశంలో అధికశాతం మంది ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే మోదీ ప్రకటించిన ఈ నిర్ణయం గతంలో మన సినిమాల్లో సైతం ప్రస్తావించడం విశేషం.
2007లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన శివాజీ సినిమాలో హీరో నల్లధనాన్ని అరికట్టడానికి పోరాడతాడు. ఆ సినిమా చివర్లో వేసే క్లిప్పింగ్స్ లో దేశం భవిష్యత్ లో 500 - 1000 నోట్లను రద్దు చేస్తే నల్లధనం హతమయ్యే అవకాశం ఉన్నట్టు చూపించడం శంకర్ విజన్ కి తార్కాణం.
అలానే ఆనంద్ రవి దర్శకత్వంలో నారా రోహిత్ నటించిన ప్రతినిధి సినిమాలలో సైతం గాంధీ లేని నోట్లు తనకు కావాలని సి ఎం ని కిడ్నాప్ చేసిన హీరో కోరతాడు. ఈ విధంగా వాడుకలో వున్న నోట్లను నిషేధిస్తే బ్లాక్ మనీ అంతమవుతుందని తెలిపాడు.
ఇక తాజా సంచలనం బిచ్చగాడు సినిమాలో ఒక బిచ్చగాడు ఎఫ్.ఎం రేడియోకి ఫోన్ చేసి నల్లధనం అంతమవ్వాలంటే వెంటనే 500 -1000 నోట్లను బ్యాన్ చెయ్యాలని ఎనాలిసిస్ తెలిపే సీన్ సూపర్ హిట్ అయ్యింది. సో మన దర్శకులు కూడా ఒకవిధంగా ఈ స్వచ్ఛభారత్ లో భాగస్వామ్యులే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/