'రోజా పూలు' శ్రీరామ్ - అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ''టెన్త్ క్లాస్ డైరీస్''. 'గరుడవేగ' సినిమాటోగ్రాఫర్ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఎస్ఆర్ మూవీ మేకర్స్ - అన్విత అవని క్రియేషన్స్ - అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అచ్యుత రామారావు - రవితేజ మన్యం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
జూలై 1వ తేదీన థియేటర్లల్లో విడుదలైన '10th క్లాస్ డైరీస్' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబడింది. ఓటీటీలో ఈ సినిమాకి మంచి ప్రేక్షదారణ దక్కుతోందని తెలుస్తోంది.
'10థ్ క్లాస్ డైరీస్' చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన జనాలు.. ఇప్పుడు ఓటీటీలో చూస్తున్నారు. సినిమాలోని కంటెంట్ కూడా ఆకట్టుకుందని కామెంట్స్ వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీకి మంచి వ్యూయర్ షిప్ రావడంతో ప్రైమ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
వెన్నెల రామారావు జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ప్రేరణతో రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేమికుడి నిర్లక్ష్యం - తండ్రి అతి ప్రేమ అనేవి ఒక అమ్మాయి జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపించాయనేది ఇందులో చూపించారు. నేటి సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రస్తావించారు.
సినిమాలో రీ యూనియన్ కాన్సెప్ట్ అందరినీ స్కూల్ డేస్ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. అవికా గోర్ - శ్రీరామ్ మధ్య లవ్ స్టోరీకి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఆద్యంతం వినోదభరితంగా ఆసక్తికరంగా సాగిన ఈ సినిమా.. క్లైమాక్స్ కు వచ్చే సరికి ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది.
ఇందులో శ్రీనివాస రెడ్డి - అర్చన - శివ బాలాజీ - అచ్యుత్ రామారావు - నాజర్ - హిమజ - భాను తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీనివాస్ రెడ్డి - అచ్యుత రామారావు నవ్వించే బాధ్యత తీసుకున్నారు. దర్శకుడే సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ ఉన్నతంగా ఉన్నాయి. సురేష్ బొబ్బలి పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్ గా '10థ్ క్లాస్ డైరీస్' ప్రేక్షకులకు ఒక ఫీల్ గుడ్ సినిమా చూశామనే అనుభూతిని కలిగిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.