ఆ హీరోకు బ్లాక్‌ బస్టర్స్ పడ్డా 11 కోట్లు నష్టమట!

Update: 2018-12-20 06:48 GMT
హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌ గా నటిస్తూ విలక్షణ నటుడిగా పేరు సంపాదించిన విజయ్‌ సేతుపతి ఈ సంవత్సరం తెలుగులో కూడా మంచి గుర్తింపును దక్కించుకన్నాడు. ఈ సంవత్సరం ఆయన కెరీర్‌ లోనే నిలిచి పోయే సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా 96 చిత్రం ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది టాప్‌ సౌత్‌ చిత్రాల జాబితాలో 96 నిలిచింది. ఇక నవాబ్‌ మూవీతో కూడా విజయ్‌ సేతుపతి అరించాడు. పెద్ద సినిమాలు, పెద్ద సక్సెస్‌ లతో ఈ ఏడాది అలరించిన విజయ్‌ సేతుపతి కి ఇదే ఏడాది 11 కోట్ల నష్టం కూడా వచ్చిందట.

విజయ్‌ సేతుపతి నటుడిగానే కాకుండా అప్పుడప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఆయన ‘జుంగా’ అనే చిత్రాన్ని నిర్మించాడు. సినిమా కథానుసారంగా ఎక్కువ శాతం విదేశాల్లోనే చిత్రీకరించారట. దాంతో బడ్జెట్‌ భారీగా పెరిగి పోయింది. అయితే సినిమా ఏ మాత్రం ఆకట్టుకోక పోవడంతో ఏకంగా 11 కోట్ల మేరకు నష్టం వచ్చినట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయ్‌ సేతుపతి చెప్పుకొచ్చాడు.

ఆ నష్టంను భర్తీ చేసుకునేందుకు తాను నటించిన మూడు సినిమాల పారితోషికంను వదుకోవాల్సి వచ్చిందని కూడా విజయ్‌ సేతుపతి అన్నాడు. ఒక వైపు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ లు దక్కిన విజయ్‌ సేతుపతి మరీ ఇంత డిజాస్టర్‌ ను కూడా తన ఖాతాలో వేసుకుని నష్టాలపాలయ్యాడన్నమాట. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి తెలుగులో చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి లో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా పలు సినిమాలు ఈయన చేతిలో ఉన్నాయి.
Tags:    

Similar News