ఇంకా మునుముందు చాలా ఉంది బావా

Update: 2021-11-14 16:30 GMT
మెగా మేన‌ల్లుడు సాయితేజ్ కెరీర్ జ‌ర్నీ ఒడిదుడుకుల‌ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `పిల్లా నువ్వు లేని జీవితం` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సాయి తేజ్ తొలి స‌క్సెస్ తోనే ప్రామిసింగ్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. అటుపై వ‌చ్చిన అవ‌కాశాల్ని అందిపుచ్చుకుంటూ కెరీర్ గ్రాఫ్ ని పెంచుకుంటూ వెళ్లారు. స‌రిగ్గా సాయితేజ్ ఎంట్రీ ఇచ్చి నేటికి ఏడేళ్లు పూర్త‌యింది. 14 న‌వంబ‌ర్ 2014 లో సాయితేజ్ న‌టించిన `పిల్లా నువ్వు లేని జీవితం` రిలీజ్ అయింది. వాస్త‌వానికి సాయితేజ్ హీరోగా `రేయ్` ముందుగా ప్రారంభ‌మైంది. కానీ మ‌ధ్య‌లో బ్రేక్ రావ‌డంతో `పిల్లా నువ్వు లేని జీవితం` ముందుగా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో అదే తొలి సినిమా అయింది.

ఆ త‌ర్వాత విజ‌యాల‌తో పాటు కొన్ని ఫెయిల్యూర్స్ ని ఎదుర్కుని న‌టుడిగా నిల‌దొక్కుకున్నారు. `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్` త‌ర్వాత సాయి కెరీర్ కాస్త డైల‌మాలో ప‌డింది. వ‌రుసగా ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెట్టాయి. చివ‌రిగా `చిత్ర ల‌హ‌రి` సినిమాతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చారు. గ‌త ఏడాది `సోలో బ్ర‌తుకే సో` బెట‌ర్ తో మ‌రో స‌క్సెస్ అందుకున్నాడు. అలాగే గ‌త నెల‌లో `రిప‌బ్లిక్` రిలీజ్ అయింది. ఈ సినిమాకు విమర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కినా క‌మ‌ర్శియ‌ల్ గా స‌క్సెస్ కాలేదు. ఈ సినిమా రిలీజ్ స‌మ‌యంలో సాయితేజ్ కి యాక్సిడెంట్ కి గురైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కోలుకుంటున్నాడు.

అయితే త‌న సినిమా కెరీర్ పూర్తై ఏడేళ్లు గ‌డుస్తోన్న సంద‌ర్భంగా సాయితేజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ఏడేళ్ల క్రితం న‌టుడ్ని కావాల‌న్న నా క‌ల నెర వేరిన రోజు ఇది. మీరంతా న‌న్ను అంగీక‌రించారు. విజ‌యాల్లో..అప‌జ‌యాల్లోనూ నా వెంట ఉన్నారు. ఈ ప్ర‌యాణానికి కార‌ణ‌మైన ప్రేక్ష‌కులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు. ఈ కామెంట్ కి వ‌రుణ్ తేజ్ స్పందించారు. ``ఇంకా మును ముందు చాలా ఉంది బావా`` అని కామెంట్ చేసారు. ల‌వ్ యూ బాబు అని వ‌రుణ్ కామెంట్ కి సాయితేజ్ రిప్లై ఇచ్చారు.


Tags:    

Similar News