1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో 'కాంత'!
అప్పటి నుంచి ఇప్పటివరకూ సినిమా సెట్స్ లోనే ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లోనూ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే `లక్కీ భాస్కర్` తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సెల్వమణి సెల్వరాజ్ దర్వకత్వంలో తమిళ్ లో` కాంత`లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రానా-దుల్కర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ కంటెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతోనే రానా భాగస్వామ్యం అయ్యాడు.
అయితే ఈ సినిమా షూటింగ్ గత ఏడాది ద్వితియార్దంలోనే మొదలైంది. కానీ దుల్కర్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ సినిమా సెట్స్ లోనే ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే `కాంత` బ్యాక్ డ్రాప్ కూడా లీకైంది. 1950 కాలం నాటి మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని తెలుస్తోంది. అప్పటి వాతావరణానికి తగ్గట్టు భారీ సెట్లు వేసి చిత్రీకరణ జరిపారట.
ఇందులో దుల్కార్ ఓ నిజ జీవిత వ్యక్తి పాత్రలో కనిపించనున్నాడుట. ఆ పాత్ర ఎంతో రియలిస్టిక్ గా ఉంటుందిట. ఈ పాత్ర కోసం దుల్కర్ ప్రత్యేకంగా హోం వర్క్ చేసాడు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల్ని కలుసుకుని ఆ పాత్ర ఆత్మని పట్టుకునే ప్రయత్నం చేసాడుట. దర్శకుడి ఇన్ పుట్స్ తో పాటు తాను వ్యక్తిగతంగా ఈ పాత్రపై శ్రద్దతో రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ కథకి తెలుగు నెటివిటీకి కి ఎంతో అవినాభావ సంబంధం కూడా ఉందట.
ఈ నేపథ్యంలో సినిమా తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో దుల్కర్ కి జోడీగా భాగ్య శ్రీ భోర్సే నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తిచేసి వేసవిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.