ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ సంచలనం రేపిన సంగంతి తెలిసిందే. ఈ చిత్రం కనీ వినీ ఎరుగని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా విడుదలై థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కూడా దాని ట్రైలర్‌కు అనూహ్య స్పందన రావడం విశేషం. తాజాగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ కు 150 మిలియన్ వ్యూస్ రావడం ఓ సరికొత్త రికార్డు.
విడుదలైన అన్ని భాషల్లో కలిపి ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ కు 15 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా ట్రైలర్ కూడా కనీసం 5 కోట్ల మైలురాయిని కూడా అందుకోలేదు. ఈ రికార్డును సమీప భవిష్యత్తులో ఏ ఇండియన్ సినిమా కూడా బద్దలుకొట్టే అవకాశం లేనట్లేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. మరే ఇండియన్ సినిమా కూడా ఇంకొన్నేళ్ల పాటు ఆ స్థాయి వసూళ్లను రాబట్టడం కష్టమే.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1800 కోట్లు వసూలు చేసింది. అయితే, దంగల్ చిత్రం వసూళ్లలో బాహుబలి-2తో పోటీపడుతోంది. వరల్డ్ వైడ్ వసూళ్లలో ‘దంగల్’ రూ.2 వేల కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
అయితే, చైనా సహా మరిన్ని దేశాల్లో ‘బాహుబలి-2’ విడుదల కావాల్సి ఉంది. కాబట్టి దంగల్ రికార్డును కూడా ‘బాహుబలి-2’ దాటేసే అవకాశాలున్నాయి. ఈ రోజు తైవాన్ లో విడుదలైన బాహుబలి-2 ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/