శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన '2.0' నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ బయటకు రాలేదుగానీ చెన్నై సిటీలో చిట్టి రోబో రచ్చ మామూలుగా లేదు. చెన్నై నగరంలో మొదటి రోజు బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది.
ఇప్పటివరకూ ఈ రికార్డు ఇళయదళపతి విజయ్ సినిమా 'సర్కార్' పేరిట ఉంది. ఈమధ్యే దీపావళి పండగ సదర్భంగా రిలీజ్ అయిన 'సర్కార్' చెన్నై సిటీలో రూ. 2. 37 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి మొదటి స్థానం లో నిలిచింది. ఇప్పుడు '2.0' మొదటి రోజు రూ. 2.64 కోట్లు సాధించి 'సర్కార్' ను రెండో స్థానానికి నెట్టేసింది. చెన్నై సిటీ వరకూ ఎప్పుడు రజనీ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే రికార్డ్ ను సవరించడం అనేది ఆనవాయితీగా మారిపోయింది.
ఓవరాల్ గా సినిమాకు డీసెంట్ రివ్యూస్.. పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ భారీస్థాయిలో నే ఉంటాయని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. పోటీలో కూడా మరే సినిమా లేకపోవడం చిట్టి రోబోకు కలిసి వచ్చే అంశమే. ఇక చెన్నై సిటీలో అల్ టైమ్ బెస్ట్ ఫైవ్ ఓపెనింగ్ డే కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
1. 2.0 : 2.64 cr
2. సర్కార్: 2.37cr
3. కాలా: 1.76 cr
4. మెర్సల్: 1.52cr
5. వివేగం: 1.21 cr