64 కోసం రౌండ‌ప్ చేసిన న‌యా మేక‌ర్స్!

ఇది అజిత్ 64వ చిత్రం అవుతుంది. అయితే ఈ సినిమా కోసం చాలా మంది స్టార్ డైరెక్ట‌ర్లు అజిత్ ని రౌండ‌ప్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

Update: 2025-02-25 13:30 GMT

త‌ల అజిత్ ఇటీవ‌లే `విదాముయార్చీ`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. దీంతో త‌దుప‌రి చిత్రం `గుడ్ బ్యాడ్ అగ్లీ` రిలీజ్ కోసం ప్రేక్ష‌కులు స‌హా అజిత్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో అజిత్ త‌దుప‌రి చిత్రం ఏ ద‌ర్శ‌కుడితోన‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇది అజిత్ 64వ చిత్రం అవుతుంది. అయితే ఈ సినిమా కోసం చాలా మంది స్టార్ డైరెక్ట‌ర్లు అజిత్ ని రౌండ‌ప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, సిరుత్తై శివ, వెంకట్ ప్రభు, కార్తీక్ సుబ్బ రాజ్ ఇప్ప‌టికే స్టోరీలు వినిపించి క్యూలో ఉన్నారట‌. అజిత్ మాత్రం ఇంకా ఎవ‌ర్నీ లాక్ చేయ‌లేదు. అంతా స్టోరీలు చెప్పి వెయిట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడా ఛాన్స్ ఎవ‌రికి వ‌స్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

కోలీవుడ్ వ‌ర్గాల ప్ర‌కారం కార్తీక్ సుబ్బ‌రాజ్ మాత్ర‌మే హైలైట్ అవుతున్నాడు. అత‌డినే అజిత్ లాక్ చేసే అవకాశం ఉంది. ఇప్ప‌టికిప్పుడు ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించి వేగంగా పూర్తి చేయాలంటే అది కార్తీక్ సుబ్బ‌రాజ్ తోనే సాధ్య‌మ‌వుతుంది. మిగ‌తా ద‌ర్శ‌కులంతా బిజీగా ఉన్నారు. ప్ర‌శాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తో.... కూలీ త‌ర్వాత లోకేష్ క‌న‌గ‌రాజ్ ఖైదీ 2తో బిజీ అవుతాడు. `సిరుత్తై` శివ కూడా మ‌రో సినిమా బిజీలో ఉన్నాడు. వెంక‌ట్ ప్ర‌భు హిట్ రేసులో లేడు.

అయితే వీళ్లంతా చాలా కాలం క్రితం స్టోరీలు వినిపించారు. కానీ అజిత్ ఆర్డ‌ర్ ప్ర‌కారం వ‌స్తున్నాడు. పైగా అజిత్ సినిమాల‌తో పాటు కార్ రేసింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. కొన్ని సంద‌ర్భాల్లో సినిమాల్ని కూడా ప‌క్క‌న‌బెట్టి రేసింగ్ కి ప్రాధాన్య‌త ఇస్తున్నాడు. ప్రస్తుతం స్పెయిన్‌ మోటార్ రేసింగ్ పోటీలో పాల్గొంటున్నాడు. తిరిగి రాగానే 64 పై పూర్తి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News