నాన్ హాలీడే(గురువారం) రోజున రిలీజైన 2.ఓ పరిస్థితి ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా కనిపిస్తోంది. ఈ సినిమాకి తొలి రెండ్రోజులు సెలవు దినాలు కాకపోవడంతో ఆశించినంత వసూళ్లు రాకపోయినా శని - ఆదివారాల వసూళ్లు ఆశల్ని నిలబెట్టాయి. అయితే ఇంతలోనే సోమవారం నుంచి సన్నివేశం ఏంటో అన్న ఆందోళన లేకపోలేదని ట్రేడ్ విశ్లేషిస్తోంది. తొలి మూడు రోజులు ఈ సినిమాకి 164కోట్ల మేర గ్రాస్ (85కోట్ల షేర్) వసూళ్లు దక్కాయని ట్రేడ్ చెబుతోంది. ఆదివారం కలుపుకుంటే 100కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి ఉండవచ్చు. ఈ సన్నివేశంలో 2.ఓ ఫుల్ రన్ లో ఇంకా ఎంత వసూలు చేస్తే సేఫ్? అని విశ్లేషిస్తే...
వాస్తవానికి 2.ఓ థియేట్రికల్ హక్కుల రూపంలో దాదాపు 295కోట్ల (సుమారు విలువ) మేర బిజినెస్ సాగింది. ఇతరత్రా డబ్బింగ్ హక్కులు - డిజిటల్ - శాటిలైట్ హక్కులు వగైరా కలుపుకుని దాదాపు 500కోట్ల మేర బిజినెస్ సాగిందని ఇదివరకూ ట్రేడ్ విశ్లేషించింది. అంటే ఈ సోమవారం నుంచి స్టడీగా వసూళ్లు దక్కించుకుని వంద కోట్ల షేర్ కి మరో 200 కోట్ల మేర షేర్ వరకూ వసూలు చేస్తే ఆ మేరకు సేఫ్ అయినట్టేనని విశ్లేషిస్తున్నారు. అయితే మరో రెండు మూడు వారాలు ఎదురే లేకుండా స్టడీగా వసూళ్లు సాధిస్తేనే ఇది సాధ్యం అన్న మాట వినిపిస్తోంది.
హిందీ బాక్సాఫీస్ గురించి తరణ్ ఆదర్శ్ రివీల్ చేస్తూ తొలి రోజు అంటూ గురువారం-20కోట్లు - శుక్రవారం -18కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం శనివారం 25కోట్లు వసూలు చేసిందని - ఆదివారం అంతకుమించి వసూళ్లు సాధిస్తుందని తెలిపారు. అంటే కేవలం హిందీ బాక్సాఫీస్ నుంచి ఆదివారం కలుపుకుంటే నాలుగు రోజుల్లో 80కోట్ల గ్రాస్ ఉత్తరాది నుంచి వసూలు చేసింది ఈ చిత్రం. ఇకపోతే తెలుగు రాష్ట్రాల నుంచి తొలిరోజు -12కోట్లు - తొలి వీకెండ్ నాటికి సుమారు 30కోట్ల మేర షేర్ వసూలు చేసిందని ట్రేడ్ చెబుతోంది. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ రిలీజ్ చేసిన నిర్మాతలు లెక్కలు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడులో మరీ అంత భారీ వసూళ్లు సాధించలేదన్న రిపోర్ట్ ఉంది. ఓవరాల్ గా 100కోట్ల మేర ఇప్పటికి తొలి 4రోజుల షేర్ దక్కితే ఇంకో రూ.200కోట్ల వరకూ వసూళ్లు సాధించాల్సి ఉంటుందన్నది ఓ విశ్లేషణ. మిగతా వసూళ్లు డిజిటల్ - ఇతరత్రా ప్లాట్ ఫామ్ లపై వెనక్కి రావాల్సి ఉంటుందన్నది ఓ విశ్లేషణ. ఈ ఆర్టికల్ లో చెప్పినవి ఉజ్జాయింపు విలువలు మాత్రమే. వందశాతం పక్కా లెక్కల్ని చిత్రయూనిట్ అధికారికంగా రివీల్ చేయాల్సి ఉందింకా.
Disclaimer: Data Gathered From Various Confidential Sources And May Also Include Estimates, We Dont Gaurantee any Aunthenticity Of The Same