టార్గెట్ 200 కోట్లు

Update: 2018-05-13 07:08 GMT
ఒకప్పుడు అంటే కొద్దిగా వెనక్కు వెళ్తే పోకిరి లాంటి సినిమాలు ఓ 50 కోట్లు వసూలు చేస్తే ఔరా ఇది ఇప్పట్లో ఎవరైనా క్రాస్ చేయగలరా అనుకున్నారు అందరు. మగధీర చూసాక వంద పెద్ద కష్టం కాదే అనిపించింది. ఇక బాహుబలి వచ్చాక ఆకాశమే హద్దుగా పెట్టుకోవచ్చని టాలీవుడ్ మేకర్స్ కి అర్థం అయిపోయింది. ఇక వర్తమానానికి వస్తే రంగస్థలం - భరత్ అనే నేను చాలా సౌకర్యవంతంగా యాభై రోజులు పూర్తి కాకుండానే 200 కోట్ల గ్రాస్ ని చేరుకోవడం చూస్తుంటే తెలుగు సినిమా స్టాండర్డ్ పెరిగింది అనడంలో సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఈ రెండు కమర్షియల్ సినిమాలు. డబ్బింగ్ లేకుండా కేవలం తెలుగు వెర్షన్ల మీద ఇంత వసూళ్లు రాబట్టాయి. బాహుబలి కేసు వేరు. మల్టీ లాంగ్వేజెస్ తో పాటు దాని కాన్వాస్ వేరే కాబట్టి అది మినహాయించాల్సిందే. ఇప్పుడు ఈ ఏడాదిలో రెండు సినిమాలు డబుల్ సెంచరీ గ్రాస్ ని అందుకోవడంతో మిగిలిన హీరోల కన్ను కూడా అదే మార్క్ మీద పడుతోంది.

సో సరైన కథ దర్శకుడు పడాలే కాని రామ్ చరణ్ మహేష్ బాబు లాంటి హీరోలకు రెండు వందల కోట్లు రాబట్టడం అసలు పెద్ద లెక్కే కాదని క్లారిటీ వచ్చింది. చరణ్ తన పదకొండో సినిమాకే ఈ ఫీట్ సాధించడం మహేష్ గతంలో దీనికి దగ్గరగా వచ్చినా ఈ సారి పక్కగా రీచ్ కావడం మిగిలిన హీరోలకు కూడా స్ఫూర్తినిస్తోందట. ఈ ఇద్దరికి సమకాలీకులైన ఇతర హీరోలు తమ టీమ్స్ ను ఈ విధంగా టార్గెట్ పెట్టుకోమని చెబుతున్నారని తెలిసింది. మార్కెట్ లో ఇంత స్కోప్ ఉండనే క్లారిటీ వచ్చేసింది కాబట్టి చరణ్ మహేష్ తరహాలో గురి చూసి కొడితే రెండు వందల కోట్లు లాగడం ఇష్యూ కాదని అనుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు ఈ విషయం ఒత్తిడి రూపంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల దర్శకనిర్మాతల మీద పడుతున్నట్టు సమాచారం. అయినా ఉత్తినే రెండు వందల కోట్లు రమ్మంటే వస్తాయా. ఇదే రామ్ చరణ్ ధృవ ఇందులో సగం తెచ్చేందుకే కష్టపడింది. మహేష్ స్పైడర్ గురించి చెప్పాల్సిన పని లేదు. స్టేచర్ ఉన్నప్పటికీ బలమైన కథా కథనాలతో ప్రేక్షకులను మెప్పించేలా సినిమా తీసినప్పుడు రెండు వందలు ఏం ఖర్మ ప్రపంచవ్యాప్తంగా 2 వేల కోట్లు రాబట్టే సత్తా తెలుగు సినిమాకు ఉందని రాజమౌళి చాటి చెప్పాడుగా. అంత కాకపోయినా సరిగ్గా ఫోకస్ పెడితే రెండు వందలు ఎంత ఈజీనో చరణ్ మహేష్ చూపించారు కాబట్టి ఆ దారిలో ఎందరు నడుస్తారో చూడాలి.
Tags:    

Similar News