2020 సినిమాల్లో అవార్డ్ కేట‌గిరీ మూవీ

Update: 2019-12-27 12:24 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుక‌నే న‌టించిన చ‌పాక్ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు.. సోష‌ల్ యాక్టివిస్ట్ ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవిత‌క‌థ‌తో మేఘ‌నా గుల్జార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌చార‌చిత్రాల‌కు జ‌నాల నుంచి అద్భుత స్పంద‌న వ‌స్తోంది.

గుల్జార్ అండ్ టీమ్ చ‌పాక్ చిత్రానికి విస్త్ర‌తంగా ప్ర‌చారం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో న‌టించిన న‌లుగురు యాసిడ్ బాధితురాళ్ల గ‌ట్స్ గురించి మేఘ‌న వివ‌రిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. యాసిడ్ బాధితురాళ్లు అయినా కెమెరా ముందుకు వ‌చ్చేందుకు ఎవ‌రూ సంకోచించ‌లేద‌ని ఆ న‌లుగురి గ‌ట్స్ పైనా ప్ర‌శంస‌లు కురిపించారు.

ప‌బ్లిక్ లోకి వెళ్లాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉంటుంది. క‌నీసం ముఖాన్ని గుడ్డ‌తో క‌వ‌ర్ చేసుకుని మ్యానేజ్ చేయాల‌నుకునే ఒక ర‌క‌మైన క‌ల‌త‌ను వీడి స్వేచ్ఛ‌గా యాసిడ్ బాధిత మ‌హిళ‌లు స‌మాజంలో తిరిగేయ‌డం అన్న‌ది స‌వాల్ లాంటిది అని అన్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో దీపిక ప‌దుకొనే ఇన్వాల్వ్ మెంట్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌నే చెప్పాలి. త‌న‌తో పాటే మ‌రో ముగ్గురు యాసిడ్ ఎటాక్ బాధితురాళ్లు ఇందులో న‌టించారు. వారి స్పిరిట్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 2020 సినిమాల్లో అవార్డ్ కేట‌గిరీ చిత్రంగా చ‌పాక్ ఇప్ప‌టిక పాపుల‌ర‌వుతోంది.
Tags:    

Similar News