2022 జనవరి నాటికి కరోనా అన్ని వేవ్ లు ముగిసిపోయి సాధారణ పరిస్థితులు వస్తాయని సినిమా నిర్మాతలు ఎంతో బలంగా నమ్మి ముందుకెళ్తున్నారు. దర్శకులు..హీరోలు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. అందుకే సంక్రాంతి కి హీరోలంతా ముందే కర్చీప్ లు వేస్తున్నారు. తమ సినిమా రిలీజ్ డేట్లను బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ నటిస్తోన్న `సర్కారు వారి పాట`.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న `రాధేశ్యామ్`.. పవన్ కళ్యాణ్ -రానా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్` సంక్రాంతి డేట్లను లాక్ చేసి పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇంకా కొంత మంది మీడియం రేంజ్ హీరోలు కూడా అదే నెలలో తమ సినిమా రిలీజుల్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఏడాది పూర్తవ్వడానికి ఇంకా నాలుగు నెలలే సమయం ఉంది...ఈ గ్యాప్ ని షూటింగ్ లతో గడిపేసినా అయిపోతుంది. కరోనా రూపాంతార వెర్షన్లపై కాస్త క్లారిటీ కూడా వస్తుందనే నమ్మకంతోనే హీరోలంతా ఇలా ప్లాన్ చేసుకున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్- ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా సంక్రాంతి బరిలో నిలిచారు. ఇద్దరు కలయికలో అనీల్ రావిపూడి దర్వకత్వంలో తెరకెక్కనున్న `ఎఫ్ 3` చిత్రాన్ని కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. `నారప్ప` సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని వెంకటేష్ రివీల్ చేసారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది. అయితే చిత్ర నిర్మాత దిల్ రాజు మాత్రం విషయాన్ని కన్ఫమ్ చేయలేదు. సినిమా రిలీజ్ లు..వాయిదాలు వేయడం వంటివి అన్ని ఆయన చేతుల మీదుగానే జరుగుతాయి. రెండు రాష్ట్రాల్లోనూ సొంత థియేటర్లు..ఎగ్జిబిటర్ల ని.. డిస్ట్రిబ్యూటర్లని నడిపించే వ్యవస్థ ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి రిలీజ్ అన్నది రాజుగారి నోట వస్తేనే ఫుల్ క్లారిటీకి ఛాన్స్ ఉంటుంది. రిలీజ్ లు అన్ని సంక్రాంతి ముందు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంత మంది స్టార్ హీరోలు ఇప్పటినుంచి సంక్రాతి డేట్లు లాక్ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.
బంగార్రాజు కూడా సంక్రాంతికే..
2021 సంక్రాంతి అంతగా కలిసిరాలేదు. ఈ నేపథ్యంలో 2022 సంక్రాంతి మంచి దారి చూపుతుందని మేకర్స్ ఆశతో ఉన్నారు. ఇక సంక్రాంతి రేసులోనే నాగార్జున `బంగార్రాజు` కూడా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో సంక్రాంతి కి రిలీజ్ అయిన `ఎఫ్-2`.. `సోగ్గాడు చిన్ని నాయనా` చిత్రాలు బ్లాక్ బస్టర్లగా నిలిచిన సంగతి తెలిసిందే.
బంగార్రాజు చిత్రీకరణపై ఇటీవల క్లారిటీ వచ్చింది. అందువల్ల సంక్రాంతి రేసులో నిలవడం ఖాయమేనని భావిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ నటిస్తోన్న `సర్కారు వారి పాట` ముందుగా సంక్రాంతి కి ఫిక్స్ అయింది. ఆ తర్వాత ఇంకా చాలా మంది అగ్ర హీరోలు సహా మీడియం హీరోలు కూడా సంక్రాంతి దగ్గరలోనే రిలీజ్ లను ప్రకటిస్తున్నారు. డిసెంబర్ చివరి నుంచి మొదలయ్యే సంక్రాంతి సీజన్ జనవరి 20 వరకూ ఉంటుంది. ఈ లోపు చాలా చిత్రాలు బాక్సాఫీస్ పోటీ బరిలో నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్రిస్మస్ లేదా సంక్రాంతి 2022 కీలకం కానుంది.
సంక్రాంతి తర్వాత కూడా కొన్ని వరుస సినిమాలు రిలీజయ్యేందుకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా...ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా ముందుగా కరోనా క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్న మర్చిపోకూడదు సుమీ.