2020 సంవత్సరం నుండి కూడా బాలీవుడ్ కష్టాలు ఎదుర్కొంటుంది. సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది. థియేటర్ రిలీజ్ చేసి సక్సెస్ కాలేకపోతున్నాం అని హిందీ ఫిల్మ్ మేకర్స్ మరియు స్టార్స్ చాలా మంది డైరెక్ట్ ఓటీటీ ద్వారా తమ సినిమాలను గత ఏడాది అంతకు ముందు ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే.
గత ఏడాది బాలీవుడ్ లో విడుదల అయిన సినిమాల్లో అయిదు సినిమాలు మాత్రమే పర్వాలేదు అన్నట్లుగా గౌరవ ప్రదమైన కలెక్షన్స్ ను రాబట్టడం జరిగింది. కాశ్మీర్ ఫైల్స్.. దృశ్యం 2.. భూల్ భులయ్యా సినిమాలు చిన్న బడ్జెట్ తో రూపొంది ఎక్కువ వసూళ్లను దక్కించుకున్నాయి. గంగూభాయ్ మరియు బ్రహ్మాస్త్ర సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొంది ఒక మోస్తరు వసూళ్లు దక్కించుకున్నాయి.
2022 సంవత్సరంలో ఆ అయిదు సినిమాలు కాకుండా మరే సినిమాలు కూడా డీసెంట్ ఓపెనింగ్స్ ను దక్కించుకోలేక పోయాయి.. అలాగే లాంగ్ రన్ లో మినిమం వసూళ్లు నమోదు చేయలేక పోయాయి. దాంతో ఈ ఏడాదిలో అయినా బాలీవుడ్ బాక్సాఫీస్ కు కాస్త ఊపు వస్తుందా అని ఫిల్మ్ సర్కిల్స్ వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాదిని షారుఖ్ ఖాన్ తన పఠాన్ సినిమా తో ఆరంభించబోతున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పఠాన్ సినిమా పై చాలా ఆశలు ఉన్నాయి. ఇక సల్మాన్ ఖాన్ నటిస్తున్న టైగర్ 3 సినిమా పై కూడా ప్రేక్షకులు ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
షారుఖ్ మరియు సల్మాన్ ఖాన్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రభాస్ సినిమాలు కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రభాస్ నుండి ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలు కూడా బాలీవుడ్ లో భారీ క్రేజ్ ను కలిగి ఉన్నాయి.
ముఖ్యంగా ఆదిపురుష్ సినిమా పూర్తిగా హిందీ సినిమా అన్నట్లుగానే అక్కడి టెక్నీషియన్స్ మరియు నటీ నటులతో రూపొందింది. కనుక టెక్నికల్ గా ఆదిపురుష్ సినిమా బాలీవుడ్ సినిమా అవుతుంది. ఇక కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడం వల్ల సలార్ పై హిందీ ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమాలు సక్సెస్ అయ్యి బాలీవుడ్ కు మళ్లీ ఊపును ఈ ముగ్గురు స్టార్స్ తీసుకు వస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.