225 వెబ్ సైట్లకు కబాలి పంచ్‌

Update: 2016-07-18 06:45 GMT
నేనొక్క సారి చెబితే వంద సార్లు కొట్టినట్లే.. ఇదీ బాషా సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫేమస్ డైలాగ్. ఇప్పుడు మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత మాఫియాడాన్ అవతారంలో రజినీ కనిపించనున్నాడు. ఈసారి మరి కౌంట్ పెరగాలి కదా.. అందుకే ఒక్క దెబ్బకే 225 మందిని మట్టి కరిపించేశాడు.

రిలీజ్ తర్వాత కబాలి తర్వాత ఎన్ని సెన్సేషన్స్ సృష్టిస్తాడో.. ఎన్ని రికార్డులకు పంచ్ లు ఇస్తాడో అప్పుడే చెప్పలేం కానీ.. విడుదలకు 4 రోజుల ముందే 225 సైట్లకు పంచ్ పడిపోయింది. ఒకేసారి 225 వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని ఆదేశిస్తూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పైరసీ మహమ్మారి పేట్రేగిపోతుండడంతో.. పైరసీకి అడ్డాగా మారిన 225 సైట్లను స్తంభింప చేయాలంటూ.. కబాలి నిర్మాతలు హైకోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆ 225 సైట్లను స్తంభింప చేయాలని ఆదేశాలిచ్చింది.

ఈ పిటిషన్ కబాలి కోసం మాత్రమే కాదని.. మొత్తం తమిళ ఇండస్ట్రీని కాపాడేందుకు అని నిర్మాత థాను చెప్పడం విశేషం. గతంలో బాహుబలి కోసం కూడా ఇలాంటి ప్రయత్నాలు గట్టిగానే జరిగాయి. ఏమైనా 225 సైట్లను బ్యాన్ చేయడంలో విజయం సాధించి.. పైరసీ సైట్లకు కబాలి గట్టి పంచ్ నే ఇచ్చాడు.
Tags:    

Similar News