కుమారి 21ఎఫ్ తో ఒక్క సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హెబ్బా పటేల్ మొన్న విడుదలైన 24 కిస్సెస్ మీద చాలా ఆశలే పెట్టుకుంది. కాని మొదటి ఆట పూర్తవడం ఆలస్యం దారుణమైన టాక్ తో పాటు రేటింగ్స్ లో సైతం ఒకటికి మించి తెచ్చుకోలేని దారుణమైన పరాజయంగా మిగిలిపోయింది. ఒక్క టికెట్ కూడా తెగని ధియేటర్లు ఈ సినిమాకు ఉన్నాయని నిన్న ఈ రోజు వచ్చిన ట్రేడ్ రిపోర్ట్ లో నిజముండే అవకాశమే ఎక్కువగా ఉంది.
కెరీర్లో ఒకటి అరా హిట్లు తప్ప పెద్ద స్పీడ్ లేకుండా సాగుతున్న హెబ్బాకు ఇది శరాఘాతమే. పైగా ప్రేక్షకులకు బొత్తిగా పరిచయమే లేని ఆదిత్ అరుణ్ తో అన్నేసి ముద్దులకు కూడా ఓకే చెప్పడం యావరేజ్ ఫలితాన్ని కూడా ఇవ్వలేకపోయింది. సినిమా పోతే పోయింది కనీసం హెబ్బాకు పేరైనా వచ్చిందా అంటే అదీ లేదు. మొత్తానికి 24 కిస్సెస్ మంచి పాఠం నేర్పింది. పబ్లిసిటీలో ఎన్ని ముద్దులను హై లైట్ చేసుకున్నా కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది మరోసారి ప్రూవ్ అయ్యింది.
ఎన్ని ముద్దులు పెడితే అంత బాగా ఓపెనింగ్స్ వస్తాయనే భ్రమలను ఈ మధ్య వస్తున్న సినిమాలు తొలగిస్తున్నాయి. హెబ్బా పటేల్ ఇంతకు ముందు చేసిన ఏంజిల్ కూడా ఇదే ఫలితాన్ని ఇచ్చింది. డెబ్యు హీరోతో భారీ ఫాంటసీ చేసినా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు రొమాన్స్ కిస్సులతో చేసిన 24 కిస్సెస్ సైతం నిరాశ పరచడంతో హెబ్బా పటేల్ నెక్స్ట్ వచ్చే ఆఫర్స్ విషయంలో ఎలాంటి అడుగు వేస్తుందో వేచి చూడాలి